Sankranti AP Bus fare Bumper Discount: సంక్రాంతి పండుగ వస్తోంది. దీంతో అందరూ ఊళ్లకు వెళతారు. ఇప్పటికే స్కూళ్లకు సైతం సెలవులను ప్రకటించారు. అయితే, ఈనెల 14 సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి. అయితే, ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు విపరీతంగా ఛార్జీలు కూడా పెంచుతాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ 10 శాతం రాయితీ ప్రకటించింది.
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ 7200 ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. రేపటి నుంచి 13 వ తేదీ వరకు 3900 స్పెషల్ బస్సులు, ఇందులో 2153 హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉండనున్నాయి. బెంగళూరు నుంచి 375 బస్సులు తిరగనున్నాయి.
అంతేకాదు ఈ బస్సులు తిరుగు ప్రయాణానికి 3200 ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే, ఈ బస్సులు సంక్రాంతి సందర్భంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. సంక్రాంతికి రానూ పోనూ బస్సు టిక్కెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ కూడా పొందుతారు.
సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ ఏ ఊళ్లో ఉన్న సొంత ఊరికి చేరుకుంటారు. సంక్రాంతి పండుగు ముఖ్యంగా ఏపీలో వైభవంగా జరుపుకుంటారు. పిల్లాపెద్దా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు నిర్వహిస్తారు.
ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ కోసం అంతా ఎదురు చూస్తుంటారు. రంగురంగుల ముగ్గులు, కోళ్ల పందెం వంటివి నిర్వహిస్తారు. ఇప్పటికే స్కూళ్లకు కూడా శుక్రవారం నుంచి సెలవులు ఇచ్చారు. దాదాపు పది రోజులపాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఈ పండుగకు కచ్చితంగా ఊరుకు వెళ్తారని ప్రైవేటు ట్రావేల్స్ వారు ఛార్జీలు పెంచుతారు.
ఈ సందర్భంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు అందించింది. 10 శాతం రాయితీ ఇవ్వడంతో సామాన్యులకు భారీ ఊరట అందినట్లయింది. ఇక స్కూళ్లు కూడా తిరిగి జనవరి 20 వ తేదీకి తెరుచుకుంటున్నాయి.