Rishikesh AI Pics: ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి రంగంలో ఏఐ వినియోగం కన్పిస్తోంది. ఫోటోగ్రఫీలో అయితే ఏఐ వినియోగంతో అద్భుత దృశ్యాలే ఆవిష్కృతమౌతున్నాయి. అందమైన కాన్వాస్ పెయింటింగ్స్‌లా మారిపోతున్నాయి. ఏఐ ఆధారిత రిషికేష్ అందాలు చూస్తే అదే అన్పిస్తుంది.
ఆహ్లాదకర వాతావరణంలో కాస్త ప్రశాంతంగా గడపాలంటే రిషికేషన్ అద్భుతమైన ప్రదేశం. ఢిల్లీ నుంచి కేవలం 5 గంటల దూరంలో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనిది.
రిషికేష్‌లో ఈ అందమైన కాన్వాస్ పెయింటింగ్స్‌లా కన్పించే దృశ్యాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రీకరించింది. ఈ హిల్ స్టేషన్ అందమైన ప్రకృతి, కొండలు, నదీ జలాలకు ప్రతీతి.
రిషికేషన్‌ను సహజంగా యోగా నగరిగా పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ పర్యాటకానికి చాలా ప్రసిద్ధి. అన్నింటికంటే బెస్ట్ అంటే రాఫ్టింగ్.
రిషికేష్‌లో బంగీ జంపింగ్, రాఫ్టింగ్, క్యాంపింగ్ వంటి సాహసాలు చాలానే అందుబాటులో ఉంటాయి.
రిషికేష్ సందర్శిస్తే కచ్చితంగా గంగా హారతిని వీక్షిస్తారు. రిషికేష్ సమీపంలోనే ఉన్న హరిద్వార్ సందర్శించాల్సి వస్తుంది.
రిషికేష్ అంటేనే గలగలపారే గంగానదిలో రాఫ్టింగ్ గుర్తొస్తుంది. ఇక్కడ రాఫ్టింగ్ అంటే అదో అందమైన, అద్భుతమైన అనుభూతి.