Banana Tips: అరటి పండ్లు పాడవకుండా, ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి

Banana Tips: అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తుంటారు. ఆరోగ్యపరంగా ఆవసరమైన అన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఒక్క మధుమేహం వ్యాధిగ్రస్థులు తప్ప అందరూ నిస్సంకోచంగా తినవచ్చు.

Banana Tips: అయితే అరటి పండ్లు త్వరగా పాడైపోతుంటాయి. అరటి పండ్లు పాడవకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి. దీనికి కొన్ని చిట్కాలున్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
 

1 /5

అరటి పండ్లను ఒకదాన్నించి మరొకటి, ఇతర పండ్ల నుంచి దూరంగా పెట్టాలి. 

2 /5

పచ్చి అరటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే నెమ్మదిగా పండుతాయి.

3 /5

అరటి పండ్లను హ్యాంగింగ్ చేసి ఉంచడం వల్ల అవి త్వరగా పాడవకుండా ఉండాయి.

4 /5

అరటి పండ్లు మగ్గిన తరువాత వాటి లైఫ్ పెంచేందుకు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అరటి పండ్లు త్వరగా పండకుండా ఉండాలంటే అరటి గుచ్చాన్ని ప్లాస్టిక్ ర్యాప్ లేదా సంచితో కప్పేయాలి.

5 /5

అరటి పండు తొక్కలపై నిమ్మరసం రాయడం వల్ల త్వరగా పండిపోకుండా ఉంటాయి. అరటి పండ్లను స్మూదీ లేదా బేకింగ్ కోసం వినియోగించేదైతే అరటి పండ్లను ఒలిచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు.