Youtube Tips: యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్లు పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

ఇటీవలి కాలంలో యూట్యూబర్ల సంఖ్య పెరుగుతోంది. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయడం, డబ్బులు సంపాదించడం చాలా సులభంగా మారింది. యూట్యూబ్ ఛానెల్ క్లిక్ అవాలంటే ముందుగా కావల్సింది సబ్‌స్క్రైబర్లు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య అధికంగా ఉంటే ఛానెల్ ఎదుగుతుంది. మరి సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎలా పెంచుకోవాలి..

Youtube Tips: ఇటీవలి కాలంలో యూట్యూబర్ల సంఖ్య పెరుగుతోంది. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయడం, డబ్బులు సంపాదించడం చాలా సులభంగా మారింది. యూట్యూబ్ ఛానెల్ క్లిక్ అవాలంటే ముందుగా కావల్సింది సబ్‌స్క్రైబర్లు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య అధికంగా ఉంటే ఛానెల్ ఎదుగుతుంది. మరి సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎలా పెంచుకోవాలి..
 

1 /6

రోజూ వీడియో అప్‌డేట్ యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వీడియోలు అప్‌లోడ్ చేస్తుండాలి. రోజూ వీడియోలు అప్‌లోడ్ చేయడం వల్ల ఛానెల్ కన్పిస్తుంటుంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుంది. 

2 /6

ఎడిటింగ్ బాగుండాలి యూట్యూబ్ ఛానెల్‌పై వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఎడిటింగ్ బాగుండాలి. వీడియో క్వాలిటీ, ఎడిటింగ్ బాగుంటే చాలా త్వరగా యూట్యూబ్ ఎదుగుతుంది

3 /6

యూట్యూబ్ షార్ట్స్ ఇటీవలి కాలంలో యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు. వీటి వ్యూయర్ షిప్ కూడా కోట్లలో ఉంటోంది. మీరు యూట్యూబ్ ఛానెల్ నడుపుతుండి సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచాలంటే యూట్యూబ్ షార్ట్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టండి. 

4 /6

యూట్యూబ్ లైవ్ వినియోగం యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచాలంటే  యూట్యూబ్ లైవ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఎక్కువమందితో కనెక్ట్ కావచ్చు. ఫలితంగా యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుంది.

5 /6

సరైన కంటెంట్ ముఖ్యం యూట్యూబ్‌లో చాలామంంది క్రియేటర్లు ఉన్నారు. వీరందరిలో ప్రత్యేకత చాటుకోవడం చాలా కష్టం. దీనికోసం సరైన కంటెంట్ ఉండాలి. మీరు వాడే వీడియో కాపీ రైట్ ఫ్రీ అయుండాలి. నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండాలి

6 /6

యూట్యూబ్ ఛానెల్‌తో ఆదాయం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ యూజర్లు దాదాపుగా 2.9 బిలియన్లు ఉన్నారు. అదే విధంగా 114 మిలియన్ల ఛానెల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానెల్‌తో ఆదాయం పొందాలంటే సబ్‌స్కైబర్ల సంఖ్య మిలియన్లలో ఉండాలి. మీరు కూడా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలనుకుంటే మీ కోసం కొన్ని టిప్స్..