బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ జరగదా అంటే అవును అనే టాక్ బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె దగ్గర పడుతుండడంతో రోజు రోజుకి ఆట మరింత రసవత్తరంగా మారుతోంది.
బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. గ్రాండ్ ఫినాలేకి మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం అఖిల్, అరియాన గ్లోరి, జబర్దస్త్ కమెడియన్ అవినాష్, మోనల్ గజ్జర్ నామినేషన్‌లో ఉన్నారు.
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో ఈ వారం అఖిల్, అరియానా గ్లోరి, జబర్దస్త్ కమెడియన్ అవినాష్, మోనల్ గజ్జర్ నామినేషన్‌లో ఉన్నారు. అఖిల్, అరియాన గ్లోరి, జబర్దస్త్ కమెడియన్ అవినాష్, మోనల్ గజ్జర్.. ఈ నలుగురిలో అవినాష్‌కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఈ వారం అవినాష్ ఎలిమినేషన్ గండం నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది. ( Image courtesy: Twitter @ star maa )
ఇక మిగిలింది అఖిల్, మోనల్, అరియానా మాత్రమే. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ముగ్గురికి కూడా ఈ వారం గండం గట్టెక్కినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండదు అని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ( Image courtesy: Twitter @ star maa )
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ రియాలిటీ షో రూల్స్ ప్రకారం వారిలో ఐదుగురికి మాత్రమే డిసెంబర్ 20న జరిగే గ్రాండ్ ఫైనల్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. ( Image courtesy: Twitter @ star maa )
అందుకే ఈ వారం ఎలిమినేషన్ లేకపోయినా వచ్చే వారం నుండి బ్యాక్-టు-బ్యాక్ ఎలిమినేషన్స్ ఉంటాయి అని లీకువీరుల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ( Image courtesy: Twitter @ star maa )
అయితే ఇప్పటివరకు పోల్ అయిన ఓట్లలో అవినాష్‌కి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్ మరోవారం బిగ్ బాస్ హౌజ్‌లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఉంది అని టాక్. ( Image courtesy: Twitter @ star maa )
వచ్చే వారం అయినా అవినాష్‌కి ఓటింగ్ పుంజుకుంటుందా ? ఒకవేళ వచ్చే వారం కూడా అవినాష్ నామినేట్ అయితే.. అప్పుడు ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కుతాడా ? ఈ వారం ఎలిమినేషన్ లేకపోతే... మరి వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేదెవరు ? ( Image courtesy: Twitter @ star maa )
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటి షో గురించి ఎప్పటికప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం జస్ట్ స్టే ఇన్ టచ్ వితజ్... ( Image courtesy: Twitter @ star maa ) Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ కంటెస్టంట్స్ మధ్య మళ్లీ రాజుకున్న అగ్గి.. నువ్వే వరస్ట్ అంటే నువ్వే వరస్ట్ అంటూ ప్రతివిమర్శలు Also read : Mandana Karimi: దుస్తులు మార్చుకుంటుండగా ఆ నిర్మాత లోపలికి వచ్చాడు Also read : Vivo V20 Pro 5G smartphone price and features: వివో వి20 ప్రో 5జి అత్యంత స్లిమ్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్ Also read : మార్కెట్‌లోకి కొత్త Honda Activa 6G.. పెట్రోల్ ఇక 10 శాతం ఆదా.. Also read : Money deposits in accounts: 18 ఏళ్లు నిండిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1,30,000 ? Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ? Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి