Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?


Kangana Ranaut Assets: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు. 
 

1 /7

దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తొంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. 

2 /7

ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి తన నామినేషన్ ను దాఖలు చేశారు. మూడోసారి తనను ఆశీర్వదించాలని కూడా ప్రజలను అభ్యర్థించారు. తనకు కాశీతో ఒక పవిత్రమైన బంధముందని మోదీ అన్నారు.  

3 /7

ఇక.. బీజేపీ నుంచి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ పత్రాలలో ఆమె తన ఆస్తుల వివరాలను అఫిటవిట్ రూపంలో ఎన్నికల అధికారికి అందించారు.

4 /7

కంగనా రనౌత్ తన ఆస్తుల వివరాలను రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. వీటిలో స్థిర ,చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.  రూ. 287 కొట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. 

5 /7

రూ. 62.9, స్థిరాస్తులు,  90 కోట్లకు పైగా విలువైన ప్రాపర్టీ ఉందని తెలిపారు. రూ. 3.91, మూడు లగ్జరీ కార్లు, ప్రస్తుతం ఆమె వద్ద 2 లక్షల నగదు, రూ.  1.35 కోట్లు తన బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు తెలిపారు.  

6 /7

దీనితో పాటు,రూ. 5 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారం, 60 కేజీల వెండి, రూ. 3 కోట్ల విలువైన 14 క్యారెట్ల విలువైన డైమండ్ ఆభరణాలు ఉన్నాయని తన నామినాషన్ పత్రంలో వెల్లడించారు. 50 ఎల్ఐసీ పాలసీలు, దీని విలువ రూ. 7.3 కోట్లుగా తెలిపారు.   

7 /7

తనపై ఎనిమిది క్రిమినల్ కేసులున్నాయని కూడా తెలిపారు. ఇక ఏడోదశలో భాగంగా.. మండిలో జూన్ 1 వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్యసింగ్ బరిలో ఉన్నారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x