Snow Blankets: ఎముకలు కొరికే చలి..గజగజ వణికించే చలి. పర్యాటకులకు ఇబ్బందులతో పాటు థ్రిల్లింగ్ కూడా అనుభవిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు మంచు దుప్పటి కప్పేసుకున్నాయి. ఆ దృశ్యాలు మీ కోసం..
ఇది స్విట్జర్లాండ్ కానేకాదు. ఇండియాలోని లాహౌల్ స్పిటి ప్రాంతమిది. అత్యధికంగా మంచు కురిసే ప్రాంతం.
హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా సహా చాలా ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. లాహౌల్ స్పిటిలో మొత్తం ప్రాంతమంతా తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉంది.
ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, హేమ్‌కుండ్ సాహిబ్, గంగోత్రి, యమునోత్రిలలో భారీగా మంచు కురుస్తోంది. ఏకంగా అడుగు మేర మంచు ఆ ప్రాంతాల్లో పేరుకుపోయింది.
జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో తాజాగా భారీ మంచు కురుస్తోంది. చాలామంది పర్యాటకులు ఈ స్నోఫాల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి గుల్మార్గ్.
నిజంగానే గడ్డుకట్టేస్తుంది. అయినా సరే కశ్మీర్‌లో పర్యాటకులకు ఈ స్నోఫాల్ ఓ థ్రిల్లింగ్. మంచు దుప్పటి కప్పేసిన మైదానాల్లో పర్యాటకులు ఆనందం పొందుతున్నారు.