BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు. ఇందులో మొదటిది బీఎస్ఎన్ఎల్. రీచార్జీ ధరలు పెరగడంతో ఎక్కువ శాతం మంది బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవుతున్నారు.
మీరు కూడా బీఎస్ఎన్ఎల్ సిమ్ కొత్తది తీసుకుంటే మీకు నచ్చిన నంబర్ ఆన్లైన్లో ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం.ఎయిర్ టెల్, జియో, వీఐ చాలా మంది వినియోగదారులు టెలికాం ధరలు పెరిగిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కు మారడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ సందర్భంగా కొన్ని దఫాలుగా 4 జీ సేవలను కూడా బీఎస్ఎన్ఎల్ విస్తరిస్తోంది ఈ సేవలను దేశంలోని వెయ్యి ప్రాంతాలకు పైగా ఉన్నాయి.అయితే, మీరు కూడా బీఎస్ఎన్ఎల్ సిమ్ పొందాలనుకుంటున్నారా?
ఈ కంపెనీ కస్టమర్లకు నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అది ఎలాగో తెలుసుకుందాం.
ముందుగా గూగుల్‌లో 'BSNL Choose Your Mobile Number' ఎంపిక చేసుకోండి ఆ తర్వాత 'Cymn' ఆప్షన్ క్లిక్ చేయండి. దాని వెంటనే సౌత్‌లో మీది ఏ జోన్ ఎంపిక చేయండి. కొత్త సబ్స్క్రైబర్లకు బీఎస్ఎన్ఎల్ సిరీస్, స్టార్టింగ్ నంబర్, చివరి నంబర్ వంటి ఎంపిక చేసుకునే సదుపాయాలు కల్పిస్తోంది.
మీకు కావాలంటే ఫ్యాన్సీ నంబర్‌ను కూడా ఎంపిక చేయవచ్చు. మీ నంబర్ ఎంపిక చేసుకున్న తర్వాత 'Reserve Number'పై క్లిక్ చేయాలి. మీ ప్రస్తుత ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ దగ్గర్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.