Cheapest 7 Seater Cars: మార్కెట్లో 7 సీటర్ కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న 7 సీటర్ కార్లు ఇవే.
రీనాల్ట్ ట్రైబర్ రీనాల్ట్ ట్రైబర్ కారు అత్యంత తక్కువ ధరకు లభించే 7 సీటర్ కారు. ఈ కారు ధర 5.92 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రోజెక్టర్ ఉన్నాయి.
మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న ఎంపీపీవీ మారుతి సుజుకి ఎర్టిగా. దీని ధర 8.35 లక్షల్నించి ప్రారంభమౌతుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా బొలేరో నియో మహీంద్రా బొలేరో నియో కూడా చాలా ప్రసిద్ధి చెందిన మోడల్. దీని ధర 9.49 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో కూడా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 100 పీఎస్ 260 ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంది.
మహీంద్రా బొలేరో మహీంద్రో బొలేరో ఏళ్ల తరబడి ప్రజల మనస్సుల్ని దోచుకుంటున్న వాహనం. బొలేరో ధర 9.53 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్, ఎయిర్ కండీషనింగ్ వంటి సౌకర్యాలున్నాయి.
భారతీయ మార్కెట్లో ఎస్యూవీ తరువాత 7 సీటర్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. కమర్షియల్ రూపంలో కూడా ఈ కార్ల వినియోగం పెరుగుతోంది. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న 7 సీటర్ కార్లు ఇవే.