Car Mileage Increase Tips: ఏం చేసినా కారు మైలేజీ పెరగడం లేదా? ఈ 4 చిట్కాలతో మీ కోరిక నెరవేరుతుంది..

Car Mileage Increase Tips In Telugu: కొన్ని చిన్న చిన్న తప్పులే కారు మైలేజీ పై ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కారు మైలేజీని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Car Mileage Increase Tips In Telugu: కారు నడిపే క్రమంలో చేసే తప్పిదాల కారణంగా మైలేజీ తగ్గుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మహిళల సమస్య ఒకటి. ఎంత పెట్రోల్ డీజిల్ కొట్టించిన మైలేజ్ రాకపోవడంతో చాలామంది మెకానికులను ఆశ్రయించి రూ.వేలు ఖర్చు చేస్తున్నారు. ఇక నుంచి ఇలా చేయనక్కర్లేదు..కొన్ని చిట్కాలను పాటించి సులభంగా మీకు మీరే మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు.
 

1 /6

విండోస్ తెరవడం వల్ల గాలి కారులోకి ప్రవేశించి కారు వేగంపై ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. దీని కారణంగా కారు వేగం తగ్గి మైలేజీ పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మైలేజీ పెంచుకోవడానికి కారు విండోస్‌ను పైకెక్కించి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.  

2 /6

కారు మైలేజీ విండోస్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది ఖర్చులను తగ్గించుకోవడానికి కారులో ఉన్న ఏసీలను ఆఫ్ చేసి విండోస్‌ని తెరిచి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మైలేజీ తగ్గే అవకాశాలున్నాయి.

3 /6

కార్ల మైలేజీ పెంచుకోవడానికి గుంతల గల రోడ్లపై కూడా ఒకే మోతాదులో డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో చాలామంది ఎక్స్ లెటర్ పెంచి నడుపుతారు. ఇలా చేయడం మానుకోవాల్సి ఉంటుంది.

4 /6

కార్లను నడిపే క్రమంలో కేవలం ఒకే పద్ధతిలో మాత్రమే నడపాల్సి ఉంటుంది. చాలామంది హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కువ స్పీడ్ తో వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా వెళ్లడం వల్ల మైలేజీ తగ్గే అవకాశాలు ఉన్నాయి.

5 /6

కారుల మైలేజీ కార్ల టైర్లపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అరిగి ఉన్న టైర్లతో కార్లను నడపడం వల్ల మైలేజీపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా కారు టైర్లలో గాలిని కూడా నింపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కారు మైలేజీని పెంచుకోవచ్చు.

6 /6

కారు మైలేజ్ పెంచుకోవడానికి ప్రస్తుతం చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల పరికరాలను వినియోగిస్తున్నారు. ఇకనుంచి వీటిని వినియోగించకుండా కూడా సులభంగా కారు మైలేజీని పెంచుకోవచ్చు.. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కేవలం ఈ క్రింది టిప్స్ పాటించడమే.