Shaakuntalam Movie: శాకుంతలం మూవీని వీక్షించిన చిత్రబృందం.. సమంత ఫ్యాన్స్ కోలాహలం

Shaakuntalam Public Talk: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ మూవీతో తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.

  • Apr 14, 2023, 18:25 PM IST
1 /5

శాకుంతలం సినిమాను చిత్రబృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో వీక్షించింది. డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమా గుణశేఖర్, హీరో దేవ్‌ మోహన్ థియేటర్‌కు వచ్చారు.

2 /5

సమంత ఫ్యాన్స్ థియేటర్ వద్ద సందడి చేశారు. టపాసులు పేలుస్తూ సందడి చేశారు. శాకుంతలం మూవీ టీమ్‌కు ఘన స్వాగతం పలికారు.  

3 /5

ప్రేక్షకులతో కలిసి శాకుంతలం సినిమాను చూశారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి హర్షం వ్యక్తం చేశారు.  

4 /5

సినిమా విషయానికి వస్తే.. శకుంతల క్యారెక్టర్‌లో సమంత పూర్తిస్థాయిలో జీవించింది. అయితే సొంత డబ్బింగ్ కావడంతో కాస్త ఎబెట్టుగా ఉంది.   

5 /5

ఇక అల్లు అర్హ ఎంట్రీతోనే అదరగొట్టింది. సినిమాలో చివరి పావు గంటే అయినా దృష్టి మొత్తం తనవైపు తిప్పుకుంది.