5 Bizarre Divorce Reasons: చిత్ర విచిత్రమైన ముక్కున వేలేసుకునే 5 విడాకుల ఘటనలు

5 Bizarre Divorce Reasons: భారతదేశంలో పెళ్లి అనేది ఓ పవిత్రమైన పటిష్టమైన బంధం. కానీ ఆధునిక బిజీ ప్రపంచంలో పెళ్లిళ్లు చాలా త్వరగా పెటాకులవుతున్నాయి. విడాకుల సంఖ్య పెరుగుతోంది. చాలా వరకు విడాకులు వ్యక్తిగతం, కుటుంబ వివాదాలతో కూడుకుని ఉంటున్నాయి. 

5 Bizarre Divorce Reasons: అదే సమయంలో కొన్ని చిత్ర విచిత్రమైన కారణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. విడాకులు కోరుతున్న కొన్ని కారణాలు వింటే ముక్కున వేలేసుకుంటారు. చాలా విడ్డూరంగా ఉంటాయి. దేశంలో అలాంటి ఆశ్చర్యపర్చే విడ్డూరమైన 5 విడాకుల కారణాలేంటో తెలుసుకుందాం.

1 /5

శుచి శుభ్రత లేకపోవడంతో విడాకులు ఇటీవల ఉత్తర ప్రదేశ్ ఆగ్రా నుంచి ఆశ్చర్యపర్చే ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ పెళ్లయిన కేవలం 40 రోజులకు తన భర్త నుంచి విడాకులు కోరింది. మహిళ చేసిన ఆరోపణల ఏంటంటే ఆమె భర్తకు శుభ్రత లేదని. అతని శరీరం నుంచి దుర్వాసన వస్తుందని. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసినప్పుడు నెలలో 1 లేదా 2 సార్లు మాత్రమే స్నానం చేస్తానని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. వారంలో ఓ రోజు గంగాజలం నెత్తిన చల్లుకుంటాడట. అయితే పరస్పరం మరోసారి మాట్లాడుకోవాలని కౌన్సిలింగ్ సెంటర్ సూచించింది.

2 /5

కేవలం మేగీ మాత్రమే వండుతున్న భార్య మరో విచిత్రమైన ఘటన కర్ణాటకలో బళ్లారిలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరాడు. కారణం ఏంటంటే అతని భార్యకు సరిగ్గా వండటమే రాదు. ఉదయం టిఫన్, మద్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ అన్నింటిలో మేగీ మాత్రమే చేస్తుందట. దాంతో విసిగిపోయిన ఆ వ్యక్తి విడాకులు కోరాడు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు 

3 /5

అమితమైన ప్రేమ ఈ ఘటన మరింత విచిత్రమైంది. ఎంత చిత్రమైందో అంతే ఆశ్చర్యపరుస్తుంది. 2020లో ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లాలోని ఓ మహిళ షరియా కోర్టులో తన భర్త నుంచి విడాకులు కోరింది. కారణం ఏంటంటే ఆమె భర్త తనను అతిగా ప్రేమిస్తున్నాడట. ఎప్పుడూ గొడవే పడడట. ఆతని ప్రేమ, అభిమానం, ఆప్యాయతో తాను విసిగిపోయిందని చెబుతోంది. అయితే షరియా కోర్టు విడాకులకు నిరాకరించడంతో ఆమె పంచాయితీలో పెట్టింది

4 /5

లడ్డూ మాత్రమే తినాలి ఉత్తర ప్రదేశ్ మీరట్ నుంచి మరో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరాడు. అతని భార్య ఓ మాంత్రికుడు చెప్పినట్టు నడుస్తోందట. అతను చెప్పినట్టుగా రోజంతా కేవలం లడ్డూ మాత్రమే తినేలా బలవంతం చేస్తోంది. ఉదయం నాలుగు లడ్డూలు, సాయంత్రం నాలుగు లడ్డూలు తినమంటోంది. మరే ఇతర ఆహరం భర్తకు తిననివ్వడం లేదు. దాంతో పదేళ్ల పెళ్లి బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడు

5 /5

యూపీఎస్సీ ప్రిపరేషన్ ఓ కారణం 2019లో భోపాల్‌కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరింది. కారణం ఏంటంటే ఆమె భర్త యూపీఎస్సీ ప్రిపరేషన్లో బిజీగా ఉండటం వల్ల భార్యకు తగిన సమయం కేటాయించలేకపోయాడు. ఇటు భార్యతో అటు కుటుంబ సభ్యులతో కూడా తగిన సమయం గడపలేకపోతున్నాడని ఆరోపణ. దాంతో ఇరువురి మధ్య విబేధాలు పెరిగాయి.