free scooty yojana 2024: మహిళలకు ఫ్రీ స్కూటీ పథకం... మోదీ సర్కార్ బంపర్ ఆఫర్

free scooty yojana 2024: మహిళలకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిందా? 75 వేల రూపాయల విలువైన స్కూటీ టూవీలర్ వాహనాలను ఉచితంగా ఇవ్వనుందా? కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గా చెబుతున్న దీని వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి తెలుసుకుందాం.

1 /6

free scooty yojana 2024: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు కేంద్ర స్థాయి నుంచి అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ మహిళలు, అదేవిధంగా చదువుకునే యువతులను ఉద్దేశించి అనేక పథకాలను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.   

2 /6

 తాజాగా సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్కూటీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అర్హులైన మహిళలందరికీ మోడీ ప్రభుత్వం ఉచితంగా స్కూటీ లను అందిస్తోందనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ వారు కేంద్ర ప్రభుత్వం 75 వేల రూపాయల విలువైన స్కూటీలను మహిళలకు అందజేస్తుందని ప్రచారం చేశారు.   

3 /6

అయితే ఈ వార్త పూర్తిగా వాస్తవమని కేంద్ర ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ వారు ఖండిస్తూ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన దానికి సంబంధించిన సమాచారాన్ని పత్రికా ప్రకటన ద్వారా కానీ టీవీ ప్రకటనల ద్వారా కానీ తెలియజేస్తుందని అది కూడా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతోనే ఆ ప్రకటనలు వెలవడుతాయని వారు తెలిపారు. 

4 /6

ఇలాంటి ఫేక్ సమాచారం పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తమ విభాగం సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మీకు అదనపు సమాచారం కావాలంటే జిల్లాలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కానీ, పంచాయతీ కార్యాలయంలో కానీ వెళ్లి తెలుసుకోవచ్చని సమాచారం తెలిపారు.   

5 /6

ప్రస్తుత సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా వారిని తప్పుడు పట్టించినట్లు అవుతుందని ఈ సందర్భంగా పిఐబి పేర్కొంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ పట్టిస్తున్నారని ఇది చటారీత్యా నేరం అని కూడా పేర్కొన్నారు. 

6 /6

అలాగే కొన్ని పథకాలు పేరిట డూప్లికేట్ వెబ్సైట్లను క్రియేట్ చేసి, వాటి లింకులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందులో మీ సమాచారాన్ని నమోదు చేయాలని కూడా కోరుతుంటారు. ఇలాంటి వెబ్సైట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పిఐబి హెచ్చరించింది. మీ దృష్టికి కూడా ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేసినట్లయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.