Best drinks for this Winter season: చలికాలం వచ్చిందంటే మూలకు పడేసిన స్వెటర్లు, రగ్గులు మళ్లీ దుమ్ము దలపాల్సిందే. ఉదయం, సాయంకాలం చలి మంటల చుట్టూ చేరడం, ఎప్పటికప్పుడు వేడి వేడిగా ఏదైనా తాగడం ఈ సీజన్‌లో చాలా కామన్. అలా అని పొద్దస్తమానం టీ, కాఫీలు తాగితే ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకు బదులు శరీరానికి ఎనర్జీని, వెచ్చదనాన్ని ఇచ్చే హెల్తీ హాట్ డ్రింక్స్ తీసుకుంటే మంచిది. మీకోసం ఇక్కడ ఐదు హెల్తీ హాట్ డ్రింక్స్ రెసిపీ వివరాలు అందిస్తున్నాం...

మసాలా దూద్: చలికాలంలో మసాలా దూద్ శరీరానికి వెచ్చదనంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మసాలా దూద్ తయారీ కోసం ముందు ఒక గ్లాసు పాలు తీసుకోండి. పిస్తా, ఇలాచీ, జాజికాయ, కేసర్‌ల మిశ్రమాన్ని ఆ పాలల్లో కలపండి. అంతే మసాలా దూద్ రెడీ. మీకు ఇష్టమైతే పాలపై సన్నగ తురిమిన పిస్తాను గార్నిష్ చేసుకోండి.
హాట్ చాక్లెట్: ఈ రెసిపీకి రెండు కప్పుల మిల్క్, నాలుగు ఇలాచీలు, ఐదు లవంగా, రెండు దాల్చినీ, నాలుగు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, రెండు టీస్పూన్ల పంచదార అవసరమవుతాయి. మొదట ఒక పాత్రలో పాలు పోసి పొయ్యిపై మరగనివ్వాలి. అందులోనే పైన చెప్పుకున్న మసాలాలన్నీ వేయాలి. పాలు కాసేపు మరిగాక చివర్లో రెండు, మూడు నిమిషాలు సన్నని సెగపై ఉంచాలి. ఆ తర్వాత కోకో పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. ఆ తర్వాత దింపేయాలి. అంతే హాట్ చాక్లెట్ రెడీ. చలికాలంలో హాట్ చాక్లెట్ తీసుకుంటే అది మీ శరీరాన్ని చాలాసేపు వెచ్చదనంగా ఉంచుతుంది.
హాట్ టాడీ : హాట్ టాడీని ఆల్కాహాల్ లేదా నాన్ ఆల్కాహాల్‌గానూ ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ ఆల్కాహాల్ హాట్ టాడీ కోసం గోరు వెచ్చని నీరు, నిమ్మరసం, తేనే, దాల్చినీ అవసరమవుతాయి. ఒక గ్లాసులో బ్లాక్ టీ తీసుకుని అందులో పైన చెప్పుకున్న ఇంగ్రిడియెంట్స్ అన్ని యాడ్ చేసి బాగా కలపాలి. చలికాలం రాత్రిపూట ఈ హాట్ టాడీ బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు.
కాశ్మీరీ నూన్ ఛాయ్ : ఈ రెసిపీ కోసం మొదట ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక టీస్పూన్ ఉప్పు, ఒక దాల్చిన చెక్క, నాలుగు ఇలాచీలు, అనాస పువ్వు, తురిమిన పిస్తా, బాదం, ఎండిన గులాబీ రెక్కలు వేసి కలపండి. పాత్రలో నీరు సగం ఆవిరియ్యే వరకు మరగనివ్వండి. ఆ తర్వాత మరో రెండు కప్పుల నీటిని పోసి మరో 10 నిమిషాల పాటు మరగనివ్వండి. చివరలో అందులో మిల్క్ పోసి మరో ఐదు నిమిషాలు మరగనివ్వండి. ఇక ఆ తర్వాత దింపేయడమే. హాట్ హాట్‌గా ఈ సూప్‌ను తీసుకుంటే శరీరానికి వెచ్చదనంతో పాటు ఎనర్జీ లభిస్తుంది.
యాపిల్ కిను వాటర్ పంచ్ : ముందుగా యాపిల్ జ్యూస్‌లో దాల్చినీ కలపండి. ఆ తర్వాత కొద్దిసేపు స్టవ్‌పై మరగనివ్వండి. ఆ తర్వాత కొద్దిగా జాజికాయ, తేనె, నిమ్మరసం, ఫైనాపిల్, ఆరెంజ్ జ్యూస్ అందులో కలపండి. ఓవెన్‌లో బేక్ చేసిన ఆరెంజెస్‌తో దాన్ని గార్నిష్ చేయండి. అంతే యాపిల్ కిను వాటర్ పంచ్ రెడీ. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది.