టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్‌ని ( kuna Srinivas Goud ) అసలు పోటీలోనే లేకుండా తప్పించాలని కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), కాంగ్రెస్ పార్టీకే చెందిన ఖుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ( Kuna Srisailam Goud ) ఆరోపించారు.
గాజుల రామారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్‌పై అనర్హత సాకు చూపించి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ రేవంత్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
గాజుల రామారం జీహెచ్ఎంసీ ఆఫీస్ బయట ఆందోళనకు దిగిన కూన శ్రీశైలం గౌడ్‌ని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోన్న పోలీసులు.
అయితే, ఆఫీస్ లోపల తన సోదరుడు ఉన్నాడని, ఆయన బయటికొచ్చాకే తాము ఇక్కడి నుంచి కదులుతామని తెగేసి చెప్పిన కూన శ్రీశైలం గౌడ్.
ఇదే విషయంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అక్కడున్న పోలీసులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ అభ్యర్థిత్వంపై ఏమైనా ఫిర్యాదులు అందినట్టయితే, ఆయనకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని... అలా చేయకుండా స్క్రూటినీ సమయం పూర్తయ్యే వరకు తాత్సారం చేయడం సరికాదు అని మండిపడ్డారు.