Jamnagar Tourism: టాప్ 5 పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్ జామ్‌నగర్

గుజరాత్ జామ్‌నగర్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ పెళ్లి కారణంగా జామ్‌నగర్ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. జామ్‌నగర్ అనేది గుజరాత్ కోస్తాతీరంలో ఉన్న పట్టణం. ఈ ఊరికి రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్, హైవే ఉండటంతో సులభంగా చేరుకోవచ్చు. అంతేకాదు జామ్‌నగర్‌లో బెస్ట్ టూరిజం ప్రదేశాలు కూడా ఉన్నాయి.

Jamnagar Tourism: గుజరాత్ జామ్‌నగర్ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ పెళ్లి కారణంగా జామ్‌నగర్ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చింది. జామ్‌నగర్ అనేది గుజరాత్ కోస్తాతీరంలో ఉన్న పట్టణం. ఈ ఊరికి రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్, హైవే ఉండటంతో సులభంగా చేరుకోవచ్చు. అంతేకాదు జామ్‌నగర్‌లో బెస్ట్ టూరిజం ప్రదేశాలు కూడా ఉన్నాయి.

1 /5

ప్రతాప్ విలాస్ ప్యాలెస్ ప్రతాప్ విలాస్ ప్యాలెస్ జామ్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సౌరాష్ట్రలోని అద్బుతమైన మహల్స్‌లో ఒకటి. ఈ ప్యాలెస్‌ను జామ్ రంజిత్ సింహ్ 1907-1915 మద్యలో నిర్మించాడు. 

2 /5

మెరైన్ నేషనల్ పార్క్ జామ్‌నగర్ కోస్తాతీరంలో ఉన్న మెరైన్ నేషనల్ పార్క్ చాలా విశిష్టమైంది. దీనిని 1980 ఆగస్టులో శాంక్చురీ హోదా వచ్చింది. అక్టోబర్ నుంచి మార్చ్ వరకూ పర్యాటకంగా తిరగవచ్చు.

3 /5

ఖజ్డియా బర్డ్ శాంక్చురీ జామ్‌నగర్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద దాదాపు 605 హెక్టార్లలో ఉంది. ఇక్కడ సీజనల్‌గా వచ్చే వలస పక్షులు వస్తుంటాయి.

4 /5

లఖోటా ప్యాలెస్ జామ్‌నగర్‌లో లఖోటా ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తుకళకు అద్భుతమైన ఉదాహరణ ఇది. 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ప్రాచీన ఆయుధాలు, ఆర్ట్, క్రాఫ్ట్, విగ్రహాలుంటాయి. ఉదయం 6 గంటల్నించి రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉంటుంది

5 /5

వంతారా అనంత్ అంబానీ జామ్‌నగర్‌లో వంతారా ప్రారంభించారు. ఇదొక కృత్రిమ అడవి. అటవీ జంతువులకు రిహాబిలిటేషన్ సెంటర్ ఇది. త్వరలో వంతారా సాధారణ పౌరుల దర్శనార్ధం తెరవబడుతుంది.