Neem Benefits: వేపాకులతో అద్భుతం, ఇలా అప్లై చేస్తే జుట్టు రాలే సమస్యకు తక్షణం పరిష్కారం

Neem Benefits: ఆధునిక పోటీ ప్రపంచం, జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుుతున్నారు. జుట్టు కుదుళ్లలో ఉండే ఓ రకమైన ఫైబర్ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. కొత్తగా జుట్టు ఎదగకుండా చేస్తుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా..

Neem Benefits: జుట్టు రాలే సమస్యకు లేదా కేశాలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలకు మార్కెట్‌లో లభించే హెయిర్ కేర్ ఉత్పత్తుల కంటే సహజసిద్ధంగా తయారుచేసుకునే హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ రకాల మందుల్లో అద్భుతమైన ఔషధంగా వినియోగించే వేపతో ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

1 /5

వేప షాంపూ వేపాకులతో తయారు చేసే షాంపూతో స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. కేశాలు పటిష్టంగా మారతాయి.

2 /5

వేప పౌడర్ వేపాకుల పౌడర్‌తో జుట్టు రాలే సమస్యకు తక్షణం చెక్ పెట్టవచ్చు. 

3 /5

వేప పేస్ట్ వేపాకులతో చేసే పేస్ట్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వాడటం వల్ల స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే దూరమౌతుంది.

4 /5

వేప నూనె వేప నూనెను కేశాలకు రాసుకుని బాగా మస్సాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల స్కాల్ప్‌కు తేమ లభించి జుట్టు రాలకుండా ఉంటుంది. 

5 /5

వేపాకుల నీరు వేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి చల్లారిన తరువాత ఆ నీళ్లను జుట్టుకు పూర్తిగా రాయడం వల్ల స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్ సమస్య దూరమౌతుంది.