Top 5 Best Selling Hatchbacks: గత కొద్దికాలంగా దేశంలో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఆగస్టు 2023లో హ్యాచ్‌బ్యాక్ కార్లు భారీగానే విక్రయమయ్యాయి. ఆగస్టులో అత్యధికంగా విక్రయమైన కార్లలో మారుతి కంపెనీ కార్లు టాప్ 3లో ఉన్నాయి..
Top 5 Best Selling Hatchbacks: పట్టణాల్లో, నగరాల్లో హ్యాచ్‌బ్యాక్ కార్లు నడిపేందుకు సౌకర్యవంతంగా ఉంటాయి. నడపడమే కాకుండా పార్కింగ్ కూడా సులభమౌతుంది. ఆగస్టు నెలలో విక్రయమైన టాప్ 5 హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకి వేగన్ ఆర్ మారుతి సుజుకి వేగన్ ఆర్ ఆగస్టు 2023లో అన్నింటికంటే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఆగ2023లో ఈ కారు 15,578 యూనిట్ల అమ్మకాలు జరపగా గత ఏడాది 18,398 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
టాటా టియాగో ఆగస్టు 2023లో అత్యధికంగా విక్రయమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా టియాగో 5వ స్థానంలో ఉంది. టాటా టియాగో ICE, EV వెర్షన్లలో అందుబాటులో ఉంది. టాటా హ్యాచ్‌బ్యాక్ ఆగస్టు నెలలో 9,463 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 7,209 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ ఆగస్టు 2023లో అన్నింటికంటే అత్యధికంగా విక్రయమైన హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. మారుతి సుజుకి స్విఫ్ట్. ఆగస్టు నెలలో ఈ కారు 18,653 యూనిట్ల అమ్మకాలు సాగించింది.
మారుతి సుజుకి ఆల్టో ఒకప్పుడు అత్యధికంగా విక్రయమౌతున్న కార్లలో ఒకటిగా ఉన్న మారుతి సుజుకి ఆల్టో 2023 ఆగస్టులో 15వ స్థానంలో ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో నాలుగవ స్థానంలో ఉంది. ఆగస్టు 2023లో 9,603 యూనిట్ల అమ్మకాలు సాదించగా, గత ఏడాది ఏకంగా 14,388 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
మారుతి సుజుకి బలేనో ఆగస్టు 2023లో అత్యధికంగా విక్రయమైన రెండవ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది మారుతి సుజుకి బలేనో. మొన్న ఆగస్టు నెలలో 18,516 యూనిట్ల విక్రయాలు జరగగా, గత ఏడాది 18 వేల 414 యూనిట్ల అమ్మకాలు సాగించింది.