Mint Leaves Benefits: శరీరంలో వివిధ పోషకాల లోపం తలెత్తినప్పుడల్లా ఏదో ఒక అనారోగ్య సమస్య బయటపడుతుంటుంది. శరీరంలో సమస్యల కారణంగా అశాంతి, చికాకు ఉంటాయి. ముఖ్యంగా కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలు బాధిస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పుదీనా ఆకులతో కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ..
బ్లోటింగ్ సమస్యకు పరిష్కారం పుదీనా ఆకులు రోజూ తినడం వల్ల చర్మానికి చాలా చలవ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు పుదీనా ఆకులు ప్రయోజనకరం.
పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పుదీనా, నిమ్మ కలిపి రాయలం వల్ల పింపుల్స్ సమస్య తొలగిపోతుంది. చర్మాన్ని అందంగా మారుస్తుంది. వారంలో 2-3 సార్లు వినియోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖం నిగారింపు ముఖం రంగు వచ్చేందుకు నిగారింపు కోసం పుదీనా ఓ ఔషధంలా పనిచేస్తుంది. ముఖం రంగును కాపాడుతుంది. ముఖానికి చలవ కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. పుదీనా ఆకుల్ని తేనెతో కలిపి మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకుంటే మంచి గ్లో వస్తుంది.
అజీర్తి సమస్య శరీరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దూరం చేసేందుకు పుదీనా ఆకులు మంచి ప్రత్యామ్నాయం. సీజన్ మారినప్పుడు అజీర్తి సమస్యను దూరం చేసేందుకు చాలా ఉపయోగకరం. నోటి దుర్వాసన సమస్యను పోగొడుతుంది.
కడుపు సంబంధిత సమస్యలు సీజన్ మారిన ప్రతిసారీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు ఎదురౌతుంటాయి. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, వాంతులు, గ్యాస్ వంటి సమస్యలు కలుగుతాయి. రోజూ పుదీనా ఆకులు నమలడం అలవాటు చేసుకుంటే ఈ సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.