Cholesterol Tips: కొలెస్ట్రాల్ తగ్గాలంటే డైట్‌లో ఈ పదార్ధాలు ఉండాల్సిందే

Cholesterol Tips: కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. గుండెను బలహీనం చేస్తుంది. రక్తనాళాల్లో ఇది ఏర్పడుతుంటుంది. ఎల్‌డీఎల్ అని కూడా పిలుస్తారు. మనిషి హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం ఇదే. 

Cholesterol Tips: అందుకే కొలెస్ట్రాల్ నియంత్రించడం చాలా అవసరం. గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే కొన్ని ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. వీటి వల్ల శరీరం నుంచి కొలెస్ట్రాల్ దూరమౌతుంది. 
 

1 /5

వంకాయ, బెండకాయ రెండూ లో కేలరీ ఆహార పదార్ధాలు. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు తొలగిస్తాయి.

2 /5

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు డైట్‌లో కెనోలా, సన్‌ఫ్లవర్ లేదా వెజిటబుల్ ఆయిల్ చేర్చాల్సి ఉంటుంది. వీటిలో ఉంటే మోనో అన్‌శాచ్యురేటెడ్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

3 /5

చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సోయా మిల్క్ లేదా సోయా ఉత్పత్తులు అద్భుతంగా పనిచేస్తాయి. సోయా ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

4 /5

బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గుతుంది. ఓట్స్‌తో పాటు అరటిపండ్లు తీసుకోవడం చాలా ప్రయోజనకరం. ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఉంంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను రక్త నాళాల్నించి తొలగించేందుకు దోహదపడుతుంది.

5 /5

యాపిల్, ద్రాక్షలను డైట్‌లో చేర్చడం వల్ల చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. ఇందులో ఉండే పేక్టిన్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఇదొక రకమైన సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ నిర్మూలనలో అద్బుతంగా ఉపయోగపడుతుంది.