Heater Buying Tips: ఇంట్లో ఎండాకాలం ఏసీలను గది చల్లబడటానికి ఎలా వినియోగిస్తామో.. చలికాలం వస్తే రూమ్ హీటర్లను వెచ్చగా ఉంచడానికి వినియోగిస్తారు. ఇతర దేశాల్లో అయితే, ఇంటికే ఇన్‌బిల్ట్ ఆప్షన్ ఉంటుంది. మన దేశంలో కూడా హీటర్లు వాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే, హీటర్లు కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి..
చలికాలం వచ్చింది వెచ్చని దుస్తులు, దుప్పట్లు కొంటారు.వేడి నీళ్ల కోసం గీజర్లు, హాట్ వాటర్ హీటర్లు వినియోగిస్తారు. అయితే, చలికాలం మన అందరి ఇళ్లలో ఉండాల్సిన మరో ముఖ్యమైన వస్తువు రూమ్ హీటర్. ఇది లేకపోతే చలికి తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. మీరు కూడా మీ ఇంటికి రూమ్ హీటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
రూమ్ హీటర్లలో మూడు రకాలు ఉంటాయి. కన్వెక్షన్ (ఫ్యాన్ బేస్డ్) ఇది ఇళ్లు పెద్దగా ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి... త్వరగా అన్ని రూమ్‌లకు వేడి వెళ్తుంది. ఇంటి వాతావరణం వెచ్చగా మారిపోతుంది.
రేడియంట్ హీటర్.. ఇవి చిన్న ఇళ్లకు సరిపోతాయి. ఆయిల్ ఫిల్ హీటర్లు ఇవి ఇంటి వాతావరణం ఎక్కువ సమయంపాటు వెచ్చగా ఉండేలా చేస్తాయి. ఎక్కువగా వినియోగించేవారికి ఇది బెస్ట్ ఎంపిక...
మీ ఇంటికి కొనుగోలు చేయబోయే హీటర్ ఎన్ని వాట్స్ ఉందో చెక్ చేయండి. ఎక్కువ వాట్స్ ఉన్న హీటర్లు కొనుగోలు చేస్తే ఎక్కువ హీట్ ఇస్తుంది, కానీ, కరెంటు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో బిల్లు తడిసి మోపెడు అవుతుంది... అడ్జస్ట్ సెట్ చేసుకునే మోడల్ మాత్రమే కొనండి. దీంతో మీకు కావాలన్నప్పుడు వేడి పెంచుకోవచ్చు.
హీటర్లే కాదు ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి కొనుగోలు చేయాలన్నా ముందుగా చూడాల్సింది సేఫ్టీ ఫీచర్స్. ఓవర్ హీట్ ప్రొటెక్షన్,వేడి పెరగగానే ఆటోమెటిగ్గా ఆఫ్ అయ్యే ఫీచర్ ఎంపిక చేయండి. ఇంట్లోకి హీటర్ కొనేటప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి, హీటర్ బయట భాగాలను టచ్ చేసినప్పుడు చల్లగా ఉండేలా చూడండి.
అంతేకాదు హీటర్లు కొనుగోలు చేసేటప్పుడు తక్కువ బరువు, పోర్టబుల్ డిజైన్ ఎంపిక చేసుకోండి. పెద్దగా ఉండే హీటర్లు ఒకే ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేసేవారికి బెస్ట్. ఫ్యాన్ బేస్ హీటర్లు ఎక్కువ శబ్దం చేస్తాయి. మీరు నైట్ నిద్ర పోకుండా ఉండాల్సి వస్తుంది. సౌండ్ రాకుండా ఉండాలంటే రేడియంట్, ఆయిల్ ఫిల్డ్ కొనుగోలు చేయాలి
హీటర్లు కొనుగోలు చేసేటప్పుడు ధర కాకుండా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. థర్మోస్టాట్ కంట్రోల్, వ్యారెంటీ కూడా ఎక్కువ కాలం పాటు ఉండేలా చూసుకోవాలి. కొత్తగా మార్కెట్లోకి నయా ఫీచర్లతో అందుబాటులోకి హీటర్లు వస్తున్నాయి.