Wifi Speed Increase: ఇంట్లో ఇన్‌స్టాల్ చేసిన వైఫై రూటర్ మంచి స్పీడ్‌తో నెట్ రావట్లేదా..? ఆఫీస్‌లో నెట్ స్లోగా ఉండడంతో పని చేయడం కష్టంగా మారిందా..? అయితే ట్రిక్స్ పాటించి మీ నెట్ స్పీడ్‌ను నాలుగు రెట్లు పెంచుకోండి.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోండి.
మీ ఇంటి వైఫై సరిగా పని చేయకపోతే.. రూటర్ పొజిషనింగ్‌ను సరిచేసుకోవాలి. తక్కువ ఎత్తులో ఉంచినప్పుడు కొన్నిసార్లు నెట్ స్లో అవుతుంది. రూటర్‌ను కొంచెం ఎత్తులో సెట్ చేసుకుని నెట్ చెక్ చేసుకోండి. వేగం పెరుగుతుంది.
వైఫై నెట్ స్పీడ్ నిరంతరం తగ్గుతూ ఉంటే.. రూటర్ వెనుక పవర్ బటన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇలా చెక్ చేస్తే నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది.
చాలాసార్లు వైరింగ్‌లో సమస్యల కారణంగా ఇంటర్నెట్ వేగం కూడా తగ్గిపోతుంది. రూటర్ వెనుకకు జోడించిన పవర్ కేబుల్‌తో పాటు ఇంటర్నెట్ కేబుల్‌ను తనిఖీ చేయాలి. మళ్లీ తీసివేసి ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయాలి. వేగం మునుపటిలాగే అవుతుంది.
మీరు యాప్‌లో WiFi ఆప్టిమైజేషన్ చెక్ చేసుకోవచ్చు. మీ రూటర్ వేగం తక్కువగా ఉంటే.. మీరు ఆప్టిమైజేషన్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కొన్ని నిమిషాలు పడుతుంది. కానీ WiFi పూర్తి వేగంతో పని చేయడం ప్రారంభిస్తుంది. డౌన్‌లోడ్ వేగం కూడా పెరుగుతుంది.
వైఫై వేగం చాలా రోజులుగా పదే పదే ఇబ్బంది కలిగిస్తుంటే.. మీరు యాప్‌లోనే రీబూట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. WiFi రూటర్‌ను రిఫ్రెష్ చేసి.. వేగాన్ని చాలా వరకు పెంచవచ్చు.