Dream Effect: కలలో ఇవి కనిపిస్తే గొప్ప రాజయోగo.. అదృష్టం మీ గుమ్మం తొక్కినట్లే..

Raja yoga dreams prediction: రాత్రి పడుకున్న తర్వాత ఒక్కొరికి ఒక్కొ విధంగా కలలు పడుతుంటాయి. కొందరికి కలలో పాములు కన్పిస్తే, మరికొందరికి పెళ్లి చేసుకున్నట్లు కలలు పడతాయి. కానీ మనకు పడే ప్రతికల వెనుక అది కల్గజేసే ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 /6

చాలా మంది పడుకున్న తర్వాత అనేక రకాల కలలు పడుతుంటాయి. దీని వల్ల  కొన్నిసార్లు మంచి ఫలితాలు కలిగితే.. మరికొన్ని సార్లు చెడు ఫలితాలు కూడా కల్గుతాయని పండితులు చెబుతున్నారు. అందుకే కలలో ఈ కింది జంతులు కన్పిస్తే వారి జీవితంలో కలిగే మార్పులను, కలిగే ఫలితాలను జ్యోతిష్య పండితులు వివరించారు.

2 /6

ముఖ్యంగా కలలో కనుక తామర పువ్వు కన్పిస్తే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కలలో కనుక తామర పువ్వు కన్పిస్తే, ఆకస్మిక ధనలాభానికి సూచనగా చెప్పుకొవచ్చు. అంతేకాకుండా.. రానున్న రోజుల్లో కూడా డబ్బులు వెతుక్కుంటూ వస్తాయని చెబుతుంటారు.

3 /6

ఏనుగును మనం వినాయకుడిగా కొలుచుకుంటాం. ఆయన మనకు వచ్చే విఘ్నాలను, ఆటంకాలను దూరం చేస్తాడు. అందుకు ఆయన మనకు రాబోయే ఆటంకాలను దూరం చేస్తున్నాడని ఈ సింబర్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకు ప్రతిరోజు వినాయకుడ్ని పూజించుకొవాలి.

4 /6

ఆవు ఒక దేవతా స్వరూపం. దీని శరీరంలో ప్రతి అణువణువున కూడా దేవుళ్లు నివసిస్తుంటారు. అందుకే ఉదయాన్నే ఆవును కనుక చూస్తే.. వీరిజీవితంలో సక్సెస్ వస్తుంది. అంతేకాకుండా.. జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతామన్నమాట.

5 /6

గుడ్లుగూబను కొందరు చెడుకు గుర్తుగా భావిస్తారు. ఇది రాత్రిపూట మాత్రమేసంచరిస్తుంది. కానీ గుడ్లగుబ అరుపులు మంచి కావని చెప్తుంటారు. అదే విధంగా ఇది కలలో కన్పిస్తే మాత్రం అలర్ట్ గా ఉండాలి.  

6 /6

కలలో పాము కన్పిస్తే.. మాత్రం రాబోయే ఇబ్బందులకు సూచిక. అంతేకాకుండా.. పాము  మన ముందు నుంచి కుడివైపు నుంచి ఎడమకు పోతే లేదా పాము మనవైపు చూసి పగడ విప్పుకుని కాసేపు చూసి వెళ్లిపోతే.. అది ఆశీర్వదించినట్లు అర్థం, ఇలాంటి కలలో కన్పిస్తే.. ఉద్యోగంలో ప్రమోషన్ లతో పాటు, డబ్బుల ప్రయోజనాలు కల్గుతాయని చెబుతుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)