Best Cars in India: దేశంలో ఒక్కో నెల ఒక్కో కంపెనీ కార్లు విక్రయాల్లో ముందుంటాయి. ప్రతి నెలా ఏ కంపెనీ కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయో జాబితా ఉంటుంది. అదే విధంగా ఫిబ్రవరి నెలలో టాప్ 5 కార్ల విక్రయాల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో మారుతి సుజుకి, హ్యుండయ్, టాటా మోటార్స్, మహీంద్రా, టొయోటా కార్లు ఉన్నాయి.
టొయోటా కంపెనీ ఐదవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో 25,220 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.
మహీంద్రా కంపెనీ విక్రయాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి నెలలో 42,401 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఏడాదికి 40 శాతం వృద్ధి నమోదు చేసింది.
టాటా కంపెనీ అమ్మకాల్లో మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి నెలలో 51,321 యూనిట్ల అమ్మకాలు జరపగా గత ఏడాది ఇదే సమయానికి 43, 140 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఏడాదికి 19 శాతం వృద్ధి కనబర్చింది.
హ్యుండయ్ కంపెనీ అమ్మకాల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాదికి 4.5 శాతం వృద్ధి కనబరుస్తోంది ఫిబ్రవరిలో 60,501 యూనిట్ల అమ్మకాలు జరిపింది.
మారుతి సుజుకి..ఫిబ్రవరి అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. ఫిబ్రవరిలో మొత్తం 1,97,471 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఏడాదికి 15 శాతం వృద్ధి కనబరుస్తోంది. గత ఏడాది 1 లక్షా 72 వేల 321 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.