Jammu Kashmir: హిమపాతంతో మరింత అందంగా భూతల స్వర్గం కశ్మీర్

  • Nov 25, 2020, 17:42 PM IST

 

భూతల స్వర్గం జమ్ముకశ్మీర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు గత మూడ్రోజులుగా పడుతున్న హిమపాతంతో కశ్మీర్ మరింత అందంగా మారింది. కొండప్రాంతాల్లో హిమపాతం, దిగువ ప్రాంతాల్లో వర్షపాతం కశ్మీర్ రమణీయంగా మారింది. లేహ్, మొఘల్ రోడ్ ప్రాంతాలు మంచు కారణంగా మూసివేశారు.

1 /6

జమ్ముకశ్మీర్ లోని పీర్ పంజాల్ ప్రాంతం, గుల్ మర్గ్, రాంబన్, బనిహాల్, శోపియా, పూంఛ్ , రాజౌరి, జోజిల్లా ప్రాంతాల్లో గత మూడ్రోజుల్నించి హిమపాతం కురుస్తోంది. దాంతో మొత్తం రాష్ట్రమంతా చలితో వణుకుతోంది. జమ్ముకశ్మీర్, లడాఖ్ లోని ఎక్కువ ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం సాధారణం కంటే 5 డిగ్రీలు పడిపోయింది.   

2 /6

ఇవాళ కూడా జమ్ముకశ్మీర్ లోని చాల ా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ హిమపాతం కురుస్తూనే ఉంది. అటు కశ్మీర్ సోన్ మార్గ్, లడాఖ్ లోని ద్రాస్ ప్రాంతాల్లో ఇంకా మంచు కురుస్తోంది.   

3 /6

కశ్మీర్ లో కురుస్తున్న హిమపాతంతో మొత్తం లోయంతా నెమ్మదినెమ్మదిగా మంచు దుప్పటి పర్చుకున్నట్టు కన్పిస్తోంది. ఢిల్లీ-ముంబాి సహా దేశవ్యాప్తంగా పర్యాటకులు  పెద్ద సంఖ్యలో  వస్తున్నారు.  

4 /6

జమ్ముకశ్మీర్ అధికారులు..ప్రధాన రహదార్లు , దూరప్రాంతాల్నించి వచ్చే రోడ్లపై మంచును తొలగించే పని ప్రారంభించారు. మరోవైపు ఉత్తర కశ్మీర్ లో కూడా మంచు జారడం ప్రారంభమైందన్న హెచ్చరికలున్నాయి.  

5 /6

ఎగువ ప్రాంతాల్లో హిమపాతం, దిగువన వర్షం ఇంకా పడడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గతంతో పోలిస్తే ఇవాళ కాస్త తక్కువే హిమపాతం కురిసింది.  

6 /6

కశ్మీర్ లో కురుస్తున్న హిమపాతంలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి ఇప్పుడు కూడా పాక్షికంగా తెరిచి ఉంది. కానీ కానీ వాతావరణ సరిగ్గా లేని కారణంగా..ఈ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు కోరుతున్నారు.