Karthika masam 2024: కార్తీక మాసంలో ఉసిరి దీపం విశిష్టత.. ఇలా వెలిగిస్తే అఖండ ధనయోగంతో పాటు సొంతింటి కల సాకారం..

Usiri deepam puja: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఉసిరి మీద దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల జీవితంలో అనుకొని విధంగా లాభాలు సొంతమౌతాయి.
 

1 /6

కార్తీకంలో ఉసిరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దీపం పెట్టేటప్పుడు.. నెలపై తమలపాకు లేదా బియ్యం వేసి దానిపై పసుపు, కుంకుమ పెట్టి దానిపైన మాత్రమే ఉసిరి దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే శివ, నారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

2 /6

కార్తీక మాసంను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో మనం చేసిన పూజలు, వ్రతాలు వందరెట్ల గొప్ప ఫలితాలు ఇస్తాయని చెబుతుంటారు.ఈ నెల అంతా కూడా శివ, కేశవుల్ని ఎక్కువగా పూజించుకుంటారు.

3 /6

అయితే.. కార్తీక మాసంలో చాలా  మంది ఉసిరి దీపంను ఎక్కువగా వెలిగిస్తారు. ఉసిరి దీపంను వెలిగించడం వెనుక అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉసిరిని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు.   

4 /6

ఉసిరి చెట్టుతో సకల దేవతలు కూడా నివాసం ఉంటారంట. అందుకే కార్తీకంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి, ఉసిరి మీద దీపారాధన కూడా చేస్తారు. దీని వల్ల జీవితంలో అఖండ ధనయోగం కల్గుతుందని చెబుతుంటారు.

5 /6

ఉసిరికి ధనాన్ని ఆకర్శించే గుణం కూడా ఉంటుందంట. అందుకే కార్తీకంలో ఎక్కువగా ఉసిరి చెట్టును పూజించడంతో పాటు, తులసీ వివాహాంలో కూడా ఉసిరిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

6 /6

ఇదిలా ఉండగా.. ఉసిరి మీద దీపం వెలిగించడంతో పాటు, ఉసిరి పండుతో పాటు పండితులకు దానంగా ఇస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అఖండ ధనయోగంతో పాటు వాహాన యోగం కల్గుతుందని పండితులు చెబుతుంటారు.