Kareena Kapoor: కరీనాకపూర్ నిజజీవితంలో ఎలా ఉంటారో తెలుసా? బయటపడిన ఆసక్తికర విషయాలు

Kareena Kapoor personality: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనాకపూర్ గురించి తెలియని వారు ఉండరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న కరీనాకపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటుంది?  ఎలా ప్రవర్తిస్తుంది? అనే విషయాలపై స్పందించారు.. కరీనాకపూర్ పిల్లలకు న్యానిగా ఉందే.. లలిత డిసిల్వా.
 

1 /5

ముఖేష్ అంబానీ, నీతో అంబానీల రెండవ కొడుకు అనంత్ అంబానీ న్యాని గా పనిచేసిన లలిత డిసిల్వా బాలీవుడ్ లో చాలా పాపులర్. కరీనాకపూర్ పిల్లలు తైమూర్, జహంగీర్ లకు కూడా ఆమె న్యానిగా పనిచేసింది. తాజాగా అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన లలిత అప్పటినుంచి ఏదో ఒక రకంగా వార్తలు నిలుస్తూనే ఉన్నారు. 

2 /5

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లలిత ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కరీనాకపూర్ ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని బయటపెట్టారు. ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు చాలా సింపుల్ గా ఉంటారు అని.. అసలు కోపం తెచ్చుకోరు అని చెప్పారు లలిత. 

3 /5

కరీనాకపూర్ అయితే చాలా నార్మల్ గా ఉంటారు అని.. అసలు ఆమెకు కోపమే రాదు అని అన్నారు లలిత. "ఆ ఇంట్లో నేను ఎనిమిదేళ్లు పనిచేశాను. సైఫ్ సర్ కూడా చాలా సింపుల్ గా ఉంటారు" అని చెప్పారు లలిత

4 /5

సైఫ్ అలీ ఖాన్ మొదటి భారీ ఆ పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ కూడా చాలా మంచివారు అని చెప్పుకొచ్చారు లలిత. సారా అలీ ఖాన్ ఇప్పటికే హీరోయిన్గా మారి బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఇబ్రహీం కూడా ఈ మధ్యనే కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాఖి ఔర్ రాణి కి ప్రేమ కహాని సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. త్వరలో హీరోగా కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు.  

5 /5

కరీనాకపూర్ ఎక్కువసేపు తన పిల్లలతో గడపాలని అనుకుంటూ ఉంటారట. తన వర్క్ కంటే ఎక్కువగా పిల్లల మీద ప్రత్యేక కేర్ చూపిస్తూ ఉంటారని.. టైమూర్, జహంగీర్ ఇద్దరినీ తనతో పాటు సెట్స్ కి కూడా తీసుకుని వెళుతూ ఉంటారు అని అన్నారు లలిత. ప్రతి అరగంటకి గంటకి ఒకసారి వచ్చి వాళ్ల మీద ఒక కన్ను వేసే ఉంచుతారట. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో ప్రతి క్షణం చాలా ముఖ్యమైనది అని ఆమె నమ్మకం

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x