శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. నిత్యం చర్మం పొడిబారడం, పెదాలపై పగుళ్లు..పెదవులు ఎండిపోవడం..ఒక్కోసారి రక్తం కారడం తరచూ పీడించే సమస్యలు. మరి శీతాకాలంలో పెదవుల సమస్యల్నించి ఎలా కాపాడుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Lip care tips: శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. నిత్యం చర్మం పొడిబారడం, పెదాలపై పగుళ్లు..పెదవులు ఎండిపోవడం..ఒక్కోసారి రక్తం కారడం తరచూ పీడించే సమస్యలు. మరి శీతాకాలంలో పెదవుల సమస్యల్నించి ఎలా కాపాడుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలు..
అందుకే చలికాలంలో రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు కచ్చితంగా తాగేలా చూసుకోవాలి. అప్పుటే నీటిశాతం పెరిగి..పెదవులపై తేమ ఉంటుంది.
పెదవులకు రోజూ వెన్న రాసుకోవడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది. లిప్ బామ్ కంటే అద్బుతంగా ప్రయోజనముంటుంది.
మునిపంటితో పెదవుల్ని కొరకడం, లేదా తరచూ పెదవుల్ని తడి చేయడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి.
చలికాలంలో సాధారణంగా నీళ్లు తక్కువ తాగుతుంటాం. ఇది కూడా పెదవులు పొడిబారడానికి ఓ కారణం.
ముందుగా పెదవులని అస్తమానూ కొరకడం చేయకూడదు. చీటికిమాటికి పెదాల్ని తడి చేయకూడదు.
రాత్రి పడుకునే ముందు ఆల్మండ్ ఆయిల్ పెదవులకు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి. నెయ్యి రాసుకున్నా మంచి ప్రయోజనముంటుంది.
మీతో పాటు ఎల్లప్పుడూ లిప్ బామ్ ని సిద్దంగా ఉంచుకోండి. పెదవులపై తేమను చేర్చి అవి ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతాయి.
పెదవులు ఆరోగ్యకరంగా ఉంటేనే అందంగా ఉంటాయి. మీ సౌందర్యం పెదవులపైనే ఆధారపడి ఉంటుందనేది మర్చిపోవద్దు మరి.