Makar Sankranthi Rangoli Designs 2025: సంక్రాంతి పండక్కి చాలా సులభంగా వేయగలిగే రంగోలి డిజైన్స్ ఇవే..మీరూ ట్రై చేయండి


 Makar Sankranthi Rangoli Designs 2025: సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చింది ముగ్గులు. రంగురంగుల ముగ్గులు లోగిలికి అందాన్ని తీసుకువస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో దాదాపు అందరి ఇళ్ల ముందు రంగు రంగుల రంగవల్లికలు దర్శనమిస్తాయి. ఈ సంక్రాంతికి మీరు ఈజీగా వేసే కొన్ని ముగ్గులను మీ ముందు ఉంచుతున్నాం..మీరూ ట్రై చేయండి. 
 

1 /8

 Makar Sankranthi Rangoli Designs 2025: సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు..ముగ్గులు కూడా. అందుకే ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు. పోటీల్లో గెలిచిన వారికి మంచి మంచి బహుమతులు కూడా ఇస్తుంటారు. ఈ కాంపిటేషన్ లో చాలా మంది మహిళలు పాల్గొంటారు. అయితే ఈ పోటీలే కాదు..పండగ  సమయంలో ఇంటి ముందు రంగు రంగుల డిజైన్ ముగ్గులు కూడా వేస్తుంటారు. పక్కింటి వాళ్లు వేసిన ముగ్గుకు పోటీ మనం ముగ్గు ఉండాలంటూ రకరకాల కొత్త డిజైన్లను ప్రయత్నిస్తుంటారు.  

2 /8

ఇక సంక్రాంతి పండగ రోజు ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అందుకే ముగ్గులు వేసి...వాటిలో పలు రకాల రంగులతో రంగవళ్లులుగా తీర్చిదిద్ది..వాటిపై గొబ్బెమ్మలు పేర్చి...రేగుపండ్లు, పూలతో అలంకరిస్తుంటారు. మరి ఈ సంక్రాంతి 2025కి ఎలాంటి ముగ్గులు మీరు కూడా వేయోచ్చు. సింపుల్ గా త్వరగా వేయగలిగే అందమైన ముగ్గులను ఇప్పుడు మనం చూద్దాం.   

3 /8

నెమళ్ల ముగ్గు  ఈ ముగ్గు వేయడం చాలా సులభం. ఇది సందు చుక్కల ముగ్గు. 13 చుక్కలు పెట్టి సందు చుక్కలు 7 వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిత్రంలో చూపించినట్లుగా రంగవల్లికలను తిప్పుతూ వేయాలి. చాలా ఈజీ   

4 /8

సీతాకోక చిలకల ముగ్గు  ఈ ముగ్గు ఇంటి ముందు వేస్తే చాలా బాగుంటుంది. ఇది 21 చుక్కలు 3 వరుసలు సందు చుక్కలు 3 వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా సీతాకోక చిలకలను వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దవచ్చు.   

5 /8

డిజైనర్ ముగ్గు  మీకు చుక్కల ముగ్గులపై ఇంట్రెస్ట్ లేనట్లయితే ఇలా డిజైన్ ముగ్గు వేసుకోవచ్చు. ఇందులో రంగులు నింపుకుంటే బాగుంటుంది.   

6 /8

చుక్కల ముగ్గు  తిప్పుడు ముగ్గు అంటుంటారు చాలా మంది. ఈ ముగ్గు కొంచెం తికమక అనిపించినా వేసిన తర్వాత చాలా బాగుంటుంది.   

7 /8

గులాబీ పువ్వుల ముగ్గు  గులబీ పువ్వులు మధ్యలో సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో ఇలా డిజైన్ అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది.   

8 /8

భోగి కుండల ముగ్గు 15 చుక్కలు సందు చుక్కలు 1 వచ్చే వరకు వేసుకోవాలి. ఈ భోగి కుండల మధ్యల  తామర పువ్వులు. చాలా బాగుంటుంది ఈ డిజైన్