Meaning of Crow Signs: హిందూ సాంప్రదాయంలో శకున శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. కాకులు ఇళ్లపై కూర్చోవడం లేదా ధాన్యం గింజలు తినడం మనం తరచుగా చూస్తుంటాం. కాకులు ఇంటి గుమ్మాలపై వాలినప్పుడు లేదా దారిలో అవి ఎదురైతే... అది శుభమో, అశుభమో చాలా మందికి అర్థం కాదు. కాకులు... అవి ఇచ్చే సంకేతాల గురించి శకున శాస్త్రంలో చెప్పబడిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...
శకున శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు లేదా పైకప్పు మీద కాకులు వాలడం శుభ పరిణామంగా పరిగణించబడుతుంది. ప్రకృతి 'కాకుల'కు భవిష్యత్తును ముందుగానే ఊహించే శక్తిని ఇచ్చిందని నమ్ముతారు.
శకున శాస్త్రం ప్రకారం... కాకి ఒక పాత్రలో నీరు తాగడాన్ని మీరు చూసినట్లయితే... అది చాలా శుభప్రదమని చెప్పొచ్చు. మీరు సమీప భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించబోతున్నారని లేదా మీరు ఏదైనా పనిలో గొప్ప విజయాన్ని పొందబోతున్నారనే దానికి అది సంకేతం.
కాకుల గుంపు ఇళ్ళ పైకప్పు మీద శబ్దం చేయడం లేదా తమలో తాము పోట్లాడటం వంటి దృశ్యాలను మీరు చాలాసార్లు చూసి ఉంటారు. శకున శాస్త్రం ప్రకారం... కాకులు అలా చేయడం అశుభం. అంటే ఆ ఇంటి యజమానికి త్వరలో కష్టాలు తప్పవన్నమాట. ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతాడు లేదా ఇంట్లో విషాదం అలుముకోవచ్చు.
తెల్లవారుజామున ఎగిరే కాకి వచ్చి ఎవరి పాదాలను తాకినా అది చాలా శుభప్రదంగా భావిస్తారు. అంటే ఆ వ్యక్తికి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుందన్నమాట. అతని కష్టాలు కూడా తొలగిపోతాయి.
కాకి నోటిలో ఆహారం లేదా రొట్టె ముక్కతో కూర్చోవడం లేదా ఎగురుతున్నట్లు మీరు చూస్తే, అది కూడా మంచిదని భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం, ఈ స్థితిలో కాకులు కనిపిస్తే... త్వరలోనే మీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుందని అర్థం.
కాకి తన నోట్లో ఏదైనా పెట్టుకుని మీ ఇంటి గేటు వద్ద తచ్చాడినట్లయితే.. మీ ఇంటికి అతిథి రాబోతున్నారని సంకేతం.