Motorola Edge 50 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్ గోట్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా మోటో కంపెనీకి సంబంధించిన కొన్ని మొబైల్స్ డెడ్ ఛీప్ ధరకే లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగాయ బ్యాంక్ తగ్గింపు కూడా లభిస్తున్నాయి. అయితే ఏయే స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భాగంగా Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ప్రస్తుతం దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఫ్లాట్ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న Motorola Edge 50 Pro 5G మొబైల్‌పై అత్యధిక తగ్గింపు లభిస్తోంది.
మార్కెట్‌లో ఈ మొబైల్ అసలు MRP ధర రూ.36,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 18 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.29,999కే పొందవచ్చు.
అలాగే ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను Axis Bank క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి రూ.2000 తగ్గింపు లభిస్తుంది.
దీంతో పాటు IDFC ఫాస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి రూ.1,500 వరకు భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
అంతేకాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి పేమెంట్ చేసేవారికి కూడా రూ.2 వేల కంటే ఎక్కువగా తగ్గింపు లభిస్తోంది.
అలాగే SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోను రూ.27,999కే పొందవచ్చు.
అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.29,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోను రూ.599కే పొందవచ్చు.