Bad Cholesterol Level: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే.. నెల రోజుల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాలను మీ బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే చాలు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.  
 

1 /7

Bad Cholesterol: మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి మంచిది..రెండవది చెడు. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగినా కొద్ది శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. అధిక బరువు ఇబ్బంది పెడుతుంది. గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తుంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనులు మూసుకుపోతాయి. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడుతారు. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్. ఇది క్షీరద కణ త్వచాలలో ముఖ్యమైన భాగం. కానీ అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ పెరగకుండా ఆహారంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.   

2 /7

ప్రతిరోజు మీ అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను చేర్చుకోండి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3 /7

బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  

4 /7

ఆలివ్ నూనెతో చేసిన వంటకాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.  

5 /7

అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అవిసె గింజల పొడిని వరుసగా 3 నెలల పాటు ఉదయం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

6 /7

మార్నింగ్ వాక్ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను 5 శాతం పెంచుతుంది.  

7 /7

ఉదయం పూట ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. నారింజలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. 750 మి.లీ నారింజ రసాన్ని ఉదయం పూట 4 వారాల పాటు నిరంతరం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.