Norway Night Time: ఆ దేశంలో రాత్రి సమయం ఎంత సేపుంటుందో తెలుసా..

సూర్యుని చుట్టూ భూమి..భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ పరిభ్రమణం చెందడం కారణంగానే పగలు రాత్రి ఏర్పడతాయి. అందుకే వివిధ దేశాల్లో పగలు-రాత్రి సమయాల్లో తేడా ఉంటుంది. అదే సమయంలో అందమైన ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గా నిలిచే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న నార్వేలో రాత్రి సమయం కేవలం 40 నిమిషాలే అంటే నమ్మలేకపోతున్నారా..అందుకే ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు.

Norway Night Time: సూర్యుని చుట్టూ భూమి..భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ పరిభ్రమణం చెందడం కారణంగానే పగలు రాత్రి ఏర్పడతాయి. అందుకే వివిధ దేశాల్లో పగలు-రాత్రి సమయాల్లో తేడా ఉంటుంది. అదే సమయంలో అందమైన ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గా నిలిచే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న నార్వేలో రాత్రి సమయం కేవలం 40 నిమిషాలే అంటే నమ్మలేకపోతున్నారా..అందుకే ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు.

1 /6

నార్వే ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటి. ధనిక దేశంతో పాటు ప్రాకృతిక రమణీయతకు పెట్టింది పేరు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు.

2 /6

నార్వే సముద్రతీరం నిజంగానే ఓ సుందరమైన ప్రాంతం. బీచ్ నుంచి ఇక్కడి నివాస ప్రాంతాల వ్యూ పాయింట్ అద్భుతం. 

3 /6

నార్వే నిజంగానే భూతల స్వర్గంలా ఉంటుంది. మంచుతో నిండుకున్న పర్వతాలు, పచ్చని పైరులు పర్యాటకుల్ని ఏడాదంతా ఆకర్షిస్తుంటాయి. మీరెన్నడూ చూడని అద్భుతమైన, అందమైన ప్రదేశాలు ఇక్కడే సొంతం.

4 /6

నార్వే సుందర రమణీయత పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇదొక మంచి అనువైన ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, అందాలు అందర్నీ హత్తుకుంటుంటాయి.

5 /6

ఉత్తర నార్వేలో శీతాకాలంలో సైతం సూర్యోదయం జరగదు. వేసవిలో సూర్యాస్తమయం ఉండదు. నార్వేలోని రోరోస్ నగరం అత్యంత చలిప్రదేశంగా భావిస్తారు. ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలకు పడిపోతుంది.

6 /6

నార్వేలో రాత్రి 12 గంటల 43 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. కేవలం 40 నిమిషాల విరామం తరువాత సూర్యోదయమైపోతుంది. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు. ఇది ఆర్కిటిక్ ప్రాంత పరిధిలోనిది. అందుకే ఇక్కడ మే-జూలై మధ్యకాలంలో అయితే 76 రోజుల వరకూ సూర్యాస్తమయమే జరగదు.