Radhashtami 2024: రాధాష్టమి రోజు అరుదైన యోగాలు.. ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుడి వరాల జల్లు..

Radhashtami 2024: ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పాత్ర పదం మాసం శుక్లపక్షం అష్టమి రోజున జరుపుకునే రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను కృష్ణాష్టమి జరుపుకున్న 15 రోజుల తర్వాత జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించని వారు రాధాష్టమి రోజున పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట.

1 /9

రాధాష్టమి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే ఈరోజున రాధాకృష్ణ విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయట.   

2 /9

ఈ సంవత్సరం రాధాష్టమి రోజు శ్రీకృష్ణుని పూజించాలి అనుకుంటున్నారా.. అయితే ఈ సంవత్సరం ఈ రాధాష్టమి పండుగ సెప్టెంబర్ 11వ తేదీన వచ్చింది. ఈరోజు పూజించడం ఎంతో శుభప్రదం.  

3 /9

ఈ సంవత్సరం వచ్చిన రాధాష్టమి పండుగ రోజున రాత్రి 11 గంటలకు ఎంతో ప్రత్యేకమైన రెండు శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు శ్రీకృష్ణుని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం సులభంగా లభించి.. అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

4 /9

కుంభరాశి వారికి రాధాష్టమి రోజున శ్రీకృష్ణుడి ప్రత్యేకమైన అనుగ్రహం లభించి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి జాబ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. దీంతోపాటు వీరు కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. 

5 /9

రాధాష్టమి రోజు ఏర్పడే రెండు యోగాల కారణంగా కుంభ రాశి వారికి కుటుంబాల్లో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే అప్పులు తీసుకున్న వారికి కూడా రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.  

6 /9

శ్రీకృష్ణుడి అనుగ్రహం మేషరాశి వారికి కూడా లభిస్తుంది. దీనికి కారణంగా రాధాష్టమి రోజున ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల సపోర్టు లభించి కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

7 /9

రాధాష్టమి రోజున మేషరాశి వారికి వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే భాగస్వాముల సపోర్టు లభించి అనుకున్న పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. అంతేకాకుండా వీరు విహారయాత్రలకు కూడా వెళ్తారు.

8 /9

కర్కాటక రాశి వారికి కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి అనుకున్న పనులన్నీ వెంట వెంటనే జరిగిపోతాయి. దీంతో పాటు కుటుంబంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే తీసుకున్న అప్పు కూడా తిరిగి చెల్లిస్తారు.

9 /9

కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆస్తులు కూడా లభిస్తాయి. అలాగే పిల్లలనుంచి అనుకున్న శుభవార్తలు కూడా వింటారు. తల్లిదండ్రుల మధ్య అనుబంధం పెరిగి వారి సపోర్టు కూడా లభిస్తుంది. దీంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది.