Samudrik Shastra about Women: సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలోని ప్రతీ పుట్టుమచ్చకు ఓ నిగూఢ అర్థం ఉంటుంది. పుట్టుమచ్చను బట్టి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయొచ్చు.
Samudrik Shastra about Women: సాముద్రిక శాస్త్రంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శరీరంలో ఒక్కో భాగంలోని పుట్టుమచ్చ ఒక్కో రహస్యాన్ని తెలియజేస్తోంది. ఒక వ్యక్తి పుట్టుమచ్చలను బట్టి అతను ఎంత అదృష్టవంతుడో చెప్పవచ్చు. అదే సమయంలో సదరు వ్యక్తి ఎంత రొమాంటిక్ అనేది కూడా చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. కుడి కన్నులో పుట్టు మచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. వారి వైవాహిక జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది.
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. తల మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ప్రతీ క్షణం తమ భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. స్త్రీలకు మోకాళ్లపై పుట్టుమచ్చ ఉంటే.. వారిని రొమాంటిక్గా పరిగణిస్తారు. కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే.. అది వారి వైవాహిక జీవితం సంతోషంగా, సాఫీగా గడిచిపోతుందనడానికి సంకేతం. ఎడమ మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే.. ప్రేమికులు తమ ప్రేమలో విజయవంతమవుతారు.
పెదవిపై పుట్టుమచ్చను ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. పెదవిపై పుట్టుమచ్చలు ఉన్న స్త్రీలు రొమాంటిక్ నేచర్ కలవారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మెడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. మెడ మధ్యలో పుట్టుమచ్చ ఉండడం కూడా శుభప్రదం. ఇది శృంగార స్వభావానికి సంకేతంగా పరిగణిస్తారు.