Sankranti Holidays 2025: సంక్రాంతికి అన్ని విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్నారు. ఏటా కనులపండువగా చేసుకునే పండుగ సందర్భంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే, ఏ విద్యాసంస్థలకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయి ఆ పూర్తి వివరాలు ఇవే..
సంక్రాంతి అంటే ఎగిరి గంతేస్తారు. పిల్లలు పెద్దలు అంతా ఊరి దారి పడతారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పండుగ కోసం ఏడాది మొత్తం ఎదురు చూసేవరున్నారు. ఈ పండుగకు ఎక్కువ శాతం మంది ఊళ్లకు వెళతారు. ఇక పండుగ అంటే ఊళ్లోనే కదా చూడాలి. సిటీలు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఈ సమయంలో విద్యాసంస్థలు కూడా అన్ని బంద్ ఉంటాయి.
అయితే, ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా భారీగానే సెలవులు వచ్చాయి. మొదటి సంక్రాంతి సెలవులు కుదించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది.. ఎందుకంటే మార్చినెల ఎగ్జామ్స్, గత సంవత్సరంలో వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు వచ్చాయి.
ఇప్పుడు ఆ గందరగోళానికి తెరపడింది. రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఎన్ని రోజులు ఇవ్వనున్నాయి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో అయితే స్కూళ్లకు సంక్రాంతి సందర్భంగా ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు బంద్ ఉంటాయి. అదే జూనియర్ కాలేజీలకు అయితే 11 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అంటే ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఈ సెలవులు వస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీ నుంచి 19 వరకు స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. ఇక జూనియర్ కాలేజీలకు ఇంకా సెలవులు ప్రకటించలేదు. అయితే, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించారు.