Sravana masam starts date 2024: శ్రావణ మాసాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసమంతా ఏదో ఒక పండుగలు ఉంటునే ఉంటాయి. కొత్తగా పెళ్లైన వాళ్లు ఈ మాసంలో మంగళగౌరీవ్రతాలను కూడా చేసుకుంటారు.
శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా పిలుస్తారు. శ్రావణం శివకేశవులకు ఎంతో ప్రీతీకరమైందని చెప్తుంటారు. ఈ మాసంలో ఏ చిన్న పూజలు, వ్రతాలు చేసిన, యాగాలు, శాంతి హోమాలు చేసిన అవి వెయ్యిరెట్లు రెట్టింపు లాభం కల్గేలా చేస్తాయని పండితులు చెప్తుంటారు. అందుకే శ్రావణంలో చాలా మంది ఉపవాసాలు సైతం చేస్తుంటారు.
ముఖ్యంగా శ్రావణంలో సోమవారం, మంగళవారం,శుక్రవారం, శనివారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. ఈసారి శ్రావణ మాసం అనేని జులై నెల 22 నుంచి ప్రారంభమౌతుంది. అంటే..సోమవారం 22 జూలై - మొదటి సోమవారం, జూలై 29 సోమవారం - రెండవ సోమవారం, సోమవారం 05 ఆగస్టు- మూడవ సోమవారం, సోమవారం 12 ఆగస్టు - నాల్గవ సోమవారం, సోమవారం 19 ఆగస్టు - ఐదవ సోమవారం అన్నమాట. ఈసారి ఐదు సోమవారాలు వస్తున్నాయి.
అదే విధంగా.. ఈసారి 4 మంగళవారాలు వస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన వారు ఈ మంగళవారం రోజుగ మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటారు. తమ భర్త దీర్ఘయువు, సుమంగళి యోగం కోసం మహిళలు ఎంతో భక్తిగా గౌరీదేవీకి పూజలు చేస్తారు. వారి వారి ఇంట్లోని సంప్రదాయల ప్రకారం కొత్తగా పెళ్లైన జంట పూజలు చేస్తారు.
ఇదిలా ఉండగా.. శ్రావణమాసం.. జులై 22 నుంచిస్టార్ట్ అయి, ఆగస్టు 19 తో ముగుస్తుంది.శ్రావణంలో ముఖ్యంగా.. వ్యాసపౌర్ణమి, సంకష్ట చతుర్థి,ఏకాదశి, ప్రదోష వ్రతం, నాగపంచమి, రాఖీపౌర్ణమి (దీన్నే శ్రావణ పూర్ణిమగా) కూడా పిలుస్తుంటారు. ఈ మాసంలో మనం చేసే ప్రతి ఒక్క పూజలు కూడా దివ్యమైన ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెప్తుంటారు.
శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే మనకు ఆయన మన కొరికలన్ని నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అదే విధంగా విష్ణు ఆలయంలో కూడా రకరకాల పూలుతో అలకంరణ చేస్తే ఆయన కూడా మనమనస్సులోని కోరికలన్ని నెరవేరుస్తాడని పండితులు చెప్తుంటారు. శ్రావణ మాసంలో నాగపంచమి రోజు నాగులకు పాలను సమర్పించాలి.
శివపురాణం ప్రకారం, 16 సోమవారాలు ఉపవాసం పాటించడం ద్వారా, వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు. సంతోషం, అదృష్టాలు కూడా పెరుగుతాయి. పెళ్లికాని అమ్మాయిలకు త్వరలో పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ సారి అరుదుగా శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి. ఈ క్రమంలో శివయ్యను భక్తితో కొలుచుకుని,జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా చూసుకొవాలని పండితులు చెప్తున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)