SBI SO Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్..1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి SBI భారీ నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు

SBI SO Recruitment 2024 : బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బిఐలోని 1511 స్పెషలిస్టు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. మీకు అర్హతతోపాటు ఆసక్తి ఉన్నట్లయితే పూర్తి వివరాలు తెలుసుకోండి. 
 

1 /7

SBI Notification for 1511 Special Officer Posts: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ నిరుద్యుగులకు అదిరిపోయే వార్తను అందించింది. బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్ మెంట్, కార్పొరేట్ సెంటర్ , రెగ్యులర్ ప్రాతిపాదికన స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1511 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్, నియామకాలకు దరఖాస్తులను కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1511 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అక్టోబర్ 4వ తేదీలోకా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.   

2 /7

అర్హతలు: పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.   

3 /7

వయస్సు: 2024జూన్ 30వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 25 నుంచి 35ఏండ్లలోపు ఉండాలి. దివ్యాంగులకు ఎస్టీస, ఎస్సీలకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది.   

4 /7

ఎంపిక విధానం: ఈ పోస్టులకు ఎంపిక చేసుకునే అభ్యర్థులు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

5 /7

జీతం: డిప్యూటీ మేనేజర్ లకు నెలకు రూ. 64,820 నుంచి రూ. 93, 960 వరకు చెల్లిస్తారు. అసిస్టెంట్ మేనేజర్ లకు నెలకు రూ. 48, 480 నుంచి రూ. 85, 920 వరకు జీతం ఉంటుంది. 

6 /7

ముఖ్యమైన తేదీలివే: సెప్టెంబర్14వ తేదీ 2024 నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 4, 2024 దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ.   

7 /7

పోస్టుల వివరాలు : డిప్యూటీ మేనేజర్ - ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ - 187 పోస్టులు,  ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ - 412 పోస్టులు, నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ - 80 పోస్టులు, ఐటీ ఆర్కిటెక్ట్ - 27 పోస్టులు,ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 07 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 798 పోస్టులు, మొత్తం పోస్టులు 1,511 అని నోటిఫికేషన్లో పేర్కొంది.