AP Schools reopen: ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకున్న పాఠశాలలు.. ఫొటోలు

అమరావతి: ఆంధ్రప్ర‌దేశ్‌ (Andhra Pradesh) లో సుధీర్ఘ కాలం నుంచి మూతబడి ఉన్న పాఠశాలలు.. ఈ రోజునుంచి పున:ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం తరగతులను నిర్వహిస్తున్నారు.
  • Nov 02, 2020, 12:41 PM IST

Schools reopen in Andhra Pradesh: అమరావతి: ఆంధ్రప్ర‌దేశ్‌ (Andhra Pradesh) లో సుధీర్ఘ కాలం నుంచి మూతబడి ఉన్న పాఠశాలలు.. ఈ రోజునుంచి పున:ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం తరగతులను నిర్వహిస్తున్నారు.

1 /4

మార్చిలో విధించిన లాక్‌డౌన్ నాటినుంచి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే.. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ద‌శ‌ల‌వారీగా స్కూళ్ల‌ను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చిన విషయం తెలిసిందే. 

2 /4

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 7నెలల నుంచి మూతబడిన స్కూళ్లు కోవిడ్ నిబంధనలతో సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్ర‌తీ తరగతి విద్యార్థులకు శానిటైజ్ చేసుకునేందుకు 15 నిమిషాల సమయం ఇస్తున్నారు. 

3 /4

మూడు ద‌శ‌ల్లో విద్యాసంస్థలను ప్రారంభించేందకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల‌కు ఒక రోజు తర్వాత ఒకరోజు అది కూడా ఒక్క పూట తరగతులను నిర్వహించనున్నారు. 

4 /4

న‌వంబ‌ర్ 23వ తేదీ నుంచి 6,7,8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు తరగతులు జ‌ర‌గ‌నున్నాయి. దీంతోపాటు ఒక‌టి నుంచి అయిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు డిసెంబ‌ర్ 14వ తేదీ నుంచి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం క్లాసులు జరగనున్నాయి.