Sreeleela: ప్రేమలో పడ్డ శ్రీలీల.. ముద్దులతో పబ్లిక్ లో.. యవ్వారం అంతవరకూ వచ్చిందా?

Sreeleela BoyFriend; యంగ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ శ్రీ లీల ఒక వ్యక్తితో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పబ్లిక్ లో ముద్దులు ఇస్తూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

1 /6

ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శక పరివేక్షణలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ అందుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన మూవీ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకుంది.   

2 /6

ఈ సినిమా అందించిన స్టేటస్ తో ఈమె ఏకంగా ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి,  ఒకే ఏడాది అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈమె నటించిన ఏ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు.   

3 /6

ఇకపోతే బాలకృష్ణ తో కలిసి భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురుగా నటించింది కానీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం బాలయ్యకే వెళ్లిపోయింది. ఇక తర్వాత మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. 

4 /6

ప్రస్తుతం తన వైద్య చదువు పైన ఫోకస్ పెట్టిన శ్రీ లీల మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.  అందులో భాగంగానే తాజాగా ప్రేమలో పడినట్లు సమాచారం.   

5 /6

తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఈమె అందులో ఒక నెటిజన్ ఐ లవ్ యు అంటూ కామెంట్ పెట్టారు. దానికి శ్రీ లీల.. ఉమ్ ఆ.. ఉమ్ ఆ.. ఐ లవ్ యు అంటూ ముద్దులతో రిప్లై ఇచ్చింది. శ్రీ లీల ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.   

6 /6

ఇది చూసిన అభిమానులు పబ్లిక్ లో ఇలా నెటిజన్స్ తో ముద్దులతో రెచ్చిపోతుంది యవ్వారం ఎంతవరకు వచ్చింది అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే అభిమానులతో ప్రేమలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చదువు పైన దృష్టి పెట్టిన శ్రీ లీల .. మరోవైపు మళ్లీ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.