Sridevi Marriage: ఆ సూపర్ స్టార్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీదేవి.. బోనీ కపూర్ ఎంట్రీ తో సీన్ రివర్స్..

Sridevi Marriage: పూల మొక్కలు, కొన్ని తేనే చుక్కలు, రంగరిస్తివో అలా వొమ్ము చేస్తివో.. అన్నట్టు శ్రీదేవి అందాన్నిఓ కవి ఓ పాటలో వర్ణించాడు. అతిలోకసుందరిగా తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి.. ప్రముఖ నిర్మాత.. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. అయితే బోనీ కపూర్ శ్రీదేవి జీవితంలోకి రాకుంటే ఆ సూపర్ స్టార్ ను పెళ్లి చేసుకోవాలనుకుందట.

1 /7

Sridevi Marriage: ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్  శ్రీదేవి జీవితంలో ఒక సినిమాకు మించిన ట్విస్టులున్నాయి. కెరీర్ పరంగా ఎదుగుతున్న టైమ్ లో పలువురు హీరోలు ఆమెపై మనసు పడ్డారు. అటు శ్రీదేవి కూడా ఒకరిద్దరు హీరోలపై మనసు పడింది.

2 /7

శ్రీదేవి హిందీలో పలువురు సూపర్ స్టార్స్ తో నటించినా.. మిథున్ చక్రబర్తితో ఆమె ప్రేమాయణం సాగింది. అయితే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అప్పటికే పెళ్లై పిల్లలున్న మిథున్ ను పెళ్ళి చేసుకోవాలనుకున్న సమయంలో  సడెన్ ఏమైందో ఏమో వీరి బంధానికి బీటలు వారిందని అప్పట్లో కొన్ని పత్రికలు కోడై కూసాయి.

3 /7

హిందీ, తెలుగు తర్వాత తమిళంలో శ్రీదేవితో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. అప్పట్లో వీళ్లిద్దరు సినిమాల్లో నటిస్తూనే ప్రేమించుకున్నట్టు తమిళ పత్రికలు రాసాయి.

4 /7

అయితే.. అప్పటికే రజినీకాంత్ కు లతాతో వివాహాం జరిగింది. ఆ తర్వాత సిల్క్ స్మిత తో కొన్నాళ్లు రజినీకాంత్ ఎఫైర్ నడిచిందనే కామెంట్స్ వినబడ్డాయి. ఇక శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్న టైమ్ లో లతా అడ్డుపడింది. ఒకానొక సమయంలో శ్రీదేవి, రజినీకాంత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని పత్రికలు  వార్తలు కూడా వచ్చాయి.  

5 /7

ఈ ఇష్యూ తర్వాత ఆ తర్వాత శ్రీదేవి, రజినీకాంత్..  కలిసి నటించలేదు. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు లీడ్ చేస్తున్నారు. మధ్యలో ఫంక్షన్స్ లో కలిసినా.. అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు.

6 /7

ఆ తర్వాత  నటిగా హిందీలో బిజీ అయిన శ్రీదేవి ముంబైలో సెటిల్ అయింది. ఆ సమయంలో శ్రీదేవి అమ్మగారికి బాగా లేకపోవడంతో బోనీ కపూర్ అండగా నిలబడ్డాడు. అలా వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అదే సమయంలో వాళ్లిద్దరు శారీరకంగా ఒకటయ్యారు. పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి.  జాన్వీ పుట్టిన తర్వాత వీళ్లిద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

7 /7

అంతకు ముందు బోనీ కపూర్ కు రాఖీ కట్టిన శ్రీదేవి.. తల్లికి ఆరోగ్యం బాగాలేపపుడు దగ్గర కావడంతో అప్పటికే పెళ్లైన బోనీ కపూర్ ను రెండో పెళ్లి చేసుకుంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x