Sruthi Haasan: 90 రెట్రో లుక్ లో అదరగొట్టిన శృతిహాసన్.. చాలా డిఫరెంట్ గా!

Sruthi Haasan mesmerizes in retro look: శృతిహాసన్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉందే.. శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లో లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

కమల్ హాసన్, వెంకటేష్ కలిసి నటించిన ఈనాడు సినిమా ప్రమోషన్స్ పాటలో ముందుగా కనిపించింది శృతిహాసన్. సింగర్ గా పరిచయమైన.. ఈ హీరోయిన్ అప్పట్లో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత సిద్ధార్థ తో అనగనగా ఒకదీరుదు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

2 /5

ఈ సినిమా విజయం సాధించకపోయిన.. శృతిహాసన్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత శృతిహాసన్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే గబ్బర్ సింగ్ సినిమా శృతిహాసన్.. పాపులారిటీ మార్చేసింది. 

3 /5

గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. శృతిహాసన్ కి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ తెలుగులో ఎప్పుడు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు శృతిహాసన్.. నటించిన చిత్రాలు దాదాపు విజయాలు సాధించినవే.  

4 /5

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది శృతిహాసన్. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో కనిపించి ఆకట్టుకుంది. ఈ మధ్యనే సలార్ చిత్రం లో మెరిసింది ఈ భామ. త్వరలో దేఖాయిత్.. సలార్ 2 సినిమాలలో కనిపించనుంది.  

5 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన..ఫోటోలు వైరల్ అవుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రెట్రో లుక్ తో ఈ హీరోయిన్ కనిపించిన ఫోటోలు అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.