Tata Avinya EV: కళ్లు చెదిరే డిజైన్, స్టైలిష్ లుక్స్ Tata Avinya EV సొగసు చూడతరమా

Tata Avinya EV: ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ప్రస్తుతం దూసుకుపోతోంది. అందులోనూ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దుమ్ము రేపేస్తోంది. దాదాపు ప్రతి మోడల్ కారు ఈవీగా కన్వర్ట్ చేసి మార్కెట్లో దింపింది. టాటా టియాగో, టాటా నెక్సాన్, టాటా పంచ్ ఇలా అన్నీ ఈవీ వెర్షన్లతో మార్కెట్లో ఉన్నాయి. కొత్తగా టాటా కర్వ్ వి ఈవీ అత్యంత స్పోర్టివ్ లుక్స్ కలిగి ఆగస్టు 7న ఎంట్రీ ఇవ్వనుంది.

Tata Avinya EV: ఇది చాలదన్నట్టు చూడగానే ఆకట్టుకునే అత్యద్భుతమైన లుక్స్, డిజైన్, స్టైల్ తో ఇండియన్ టెస్లా కారులా కన్పించే TATA AVINYA తీసుకొస్తోంది. ఇది టాటా మోటార్స్ కార్లే కాకుండా మార్కెట్లో ఉన్న అన్ని కార్లకు భిన్నమైంది. ఆకర్షణీయమైంది. సొగసు చూడముచ్చటగా ఉన్న కారు ఇది. టాటా అవిన్యా ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

1 /7

TATA AVINYA Looks టాటా అవిన్యా ఈవీ కారు చూస్తుంటే పదే పదే చూడాలన్పిస్తోంది. అత్యంత ఆకర్షణీయంగా టెస్లా కారులా కన్పిస్తోంది. ఇదొక హై ఎండ్, లగ్జరీ, మోస్ట్ కంఫర్టబుల్ కారు కానుంది. టాటా మోటార్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న కారు ఇది

2 /7

TATA AVINYA EV Mileage ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అది కూడా కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదే బెస్ట్ అనే చర్చ నడుస్తోంది. 

3 /7

TATA AVINYA అంటే అర్ధం AVINYA అనేది సంస్కృతి పదం. దీనర్ధం Innovation. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అనుసంధానించి రూపొందించారు. 

4 /7

TATA AVINYA Design బటర్ ప్లై డోర్లు ఈ అవిన్యా కారు ప్రత్యేకతల్లో ఒకటి. 3వ జనరేషన్ ఎలక్ట్రిఫికేషన్ తో ఈ కారు తయారైంది. అవిన్యా కారును స్క్రీన్ లెస్ విదానంలో రూపుదిద్దుకుంది. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత

5 /7

TATA AVINYA concept Minimise, Maximise, Optimise టాటా అవిన్యా కారును తీసుకురావడంలో టాటా మోటార్స్ కాన్సెప్ట్ ఇదే. ప్రస్తుతం అందుబాటులో అన్ని ఎలక్ట్రిక్ కార్లతో ఇదే టాప్ అండ్ హై ఎండ్ కానుంది

6 /7

TATA AVINYA Price TATA AVINYA కారు ప్రారంభ ధర 30 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఇందులో హై ఎండ్ కారు అయితే 60 లక్షల రూపాయలుండవచ్చు.

7 /7

TATA AVINYA launch అందరిలో ఆసక్తి, ఆతృత రేపుతున్న ఈ కారు 2025 అంటే వచ్చే ఏడాది జూన్ నెలలో మార్కెట్లో రావచ్చని అంచనా ఉంది.