Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్ డేట్... ఎగ్జామ్ ఫలితాలు ఆ తేది తర్వాతే ..

Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే విద్యార్థులు తమ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్ ఏప్రిల్ 20 తర్వాత మాత్రమే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

1 /6

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండోవ సంవత్సరం ఎగ్జామ్ లు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇప్పటికే విద్యార్థులు తదుపలి నీట్ కు ఇప్పటి నుంచే కోచింగ్ లో చేరిపోయారు. కొందరు తమ నెక్ట్స్ టార్గెట్ పై ఫోకస్ పెట్టేశారు. దీని కోసం ఎంతో కష్టపడి మరీ చదువుతున్నారు. 

2 /6

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడీయట్ ఇంటర్ ఎగ్జామ్ ల ఫలితాల విడుదలపై ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఏప్రిల్ 20 తర్వాత తెలంగాణ మొదటి, రెండో ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఎగ్జామ్ మూల్యాంకనం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.

3 /6

విద్యార్థులు సాధించిన మార్కుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  దీని కోసం కొంత సమయం పడుతుందని అది పూర్తయిన వెంటనే,ఎగ్జామ్ రిజల్ట్ లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి నెల 19 వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లు జరిగాయి. 

4 /6

మొత్తంగా బోర్డ్ ఇంటర్మీడీయట్ వారు.. నాలుగు విడతల్లో ఎగ్జామ్ మూల్యాంకనం చేసినట్లు తెలుస్తోంది.విద్యార్థుల మార్కుల నమోదుతో పాటు, ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

5 /6

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి తీసుకుని ఇంటర్ రిజల్ట్స్ లను విడుదల చేస్తామని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఏపీలో నిన్న ఇంటర్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

6 /6

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికల హవా కొనసాగింది. సెకండియర్లో అమ్మాయిలు 81 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అబ్బాయిలు 75 శాతం మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64 శాతం మంది పాస్ అయ్యారు.