Telugu Movie Sequels 2024 Streaming Platforms : పుష్ప 2, టిల్లు స్క్వేర్.. లాంటి సీక్వెల్ సినిమాలు ఈ సంవత్సరం బిరుదులై భారీ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. అలానే కొన్ని సీక్వెల్స్ ఫ్లాప్ గా కూడా నిలిచాయి. విజయాలు సాధించిన, అపజయాలు సాధించిన ఈ సంవత్సరం ఎక్కువ శాతం సీక్వెల్స్ విడుదలవ్వడం విశేషం. ఈ క్రమంలో ఈ సంవత్సరం విడుదలైన సీక్వెల్స్ గురించి ఒకసారి చూద్దాం.
2024 సంవత్సరం..తెలుగు సినిమా రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. నాణ్యమైన కథలు, ప్రాధాన్యమైన సాంకేతికతతో సినిమాలు, ప్రేక్షకులను ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం విడుదలైన భారీ సినిమాలలో..కల్కి 2898 AD.. రూ.1000 కోట్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక దేవరా సినిమా.. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూ.500 కోట్ల మార్క్ దాటింది. అదేవిధంగా చిన్న, కంటెంట్-ఆధారిత చిత్రాలు కూడా థియేటర్లలో మంచి వసూళ్లను సాధించాయి. ఈ క్రమంలో గత సంవత్సరాలు విడుదలైన కొన్ని సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాగా.. కొన్ని అపజయాలు కూడా సాధించాయి. మరి ఆ సీక్వెల్స్ ఏవి.. ఎక్కడ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి ఒకసారి చూద్దాం.
సీక్వెల్స్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ముందుగా చెప్పుకోవలసిన సినిమా పుష్ప 2. పుష్ప మొదటి భాగం కి గాని అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ సాధించగా.. ఇప్పుడు విరుదలైన రెండో భాగం కూడా రూ.1500 కోట్ల క్లబ్లో చేరి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో సైతం అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.
2019లో విడుదలైన ఈ చిత్రం మొదటి భాగం ప్రజల మద్దతును పొందినా.. యాత్ర సీక్వెల్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. భావోద్వేగ లోతుల లోపం, నెమ్మదైన కథనం విమర్శలు ఎదుర్కొన్నాయి. స్ట్రీమింగ్ భాగస్వామి: ప్రైమ్ వీడియో
2022న విడుదలైన భామాకలాపం ఓటిటి సినిమా ప్రియమణికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన రెండో భాగంలో..ప్రియమణి నటన మెచ్చుకోదగినదే అయినప్పటికీ, కథలో లోపాలు విమర్శల పాలయ్యాయి. స్ట్రీమింగ్ భాగస్వామి: ఆహా వీడియో
2022 విడుదలైన డీజే టిల్లు.. సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే టిల్లు స్క్వేర్. ఈ రెండో భాగం మొదటి భాగం కన్నా విజయం సాధించడం విశేషం. సిద్ధు జొన్నలగడ్డ నటన, హాస్యం ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాయి. హై స్ట్రీమింగ్ భాగస్వామి: నెట్‌ఫ్లిక్స్
2014లో విడుదలై మంచి విజయమందుకున్న గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే గీతాంజలి రెండో భాగం. ముందు భాగం విజయవంతమైనప్పటికీ, ఈ సీక్వెల్‌కు బలహీన స్క్రీన్‌ప్లే కారణంగా ఫ్లాప్ గా నిలిచింది. స్ట్రీమింగ్ భాగస్వామి: ఆహా వీడియో
2019లో విడుదలైన మత్తు వదల చిత్రానికి ఈక్వల్ గా వచ్చిన మత్తు వదలరా 2 మరింత విజయం సాధించింది. స్ట్రీమింగ్ భాగస్వామి: నెట్‌ఫ్లిక్స్