Thyroid Reduce Food: థైరాయిడ్‌ వ్యాధి ఉన్నవారు ఈ ఫుడ్స్‌ తీసుకుంటే శాశ్వతంగా చెక్..

Thyroid Reduce Food:  ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది థైరాయిడ్‌ వ్యాధికి గురవుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ ఆహారాలను వినియోగిస్తే సులభంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

  • Dec 02, 2022, 13:41 PM IST

Thyroid Reduce Food: ప్రస్తుతం భారత్‌లో థైరాయిడ్‌ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల శరీరంలో జీవక్రియలకు సహాయపడే మెడ అడుగు భాగంలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి దీనిని ముందుగానే గమనించి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కోసం ఆరోగ్య నిపుణులుసూచించిన ఈ సూపర్‌ ఫుడ్స్‌ తినండి.

1 /5

థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు వారు తీసుకునే ఆహారంలో తప్పకుండా పాలతో కలిగిన పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా డ్రైఫ్రూట్స్‌ను తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

2 /5

థైరాయిడ్ ఉన్నవారు తప్పకుండా ఆహారంలో పోషకాలున్న పండ్లను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వీరు ప్రతి రోజూ ఆహారంలో అరటి, నారింజ, టమోటా, బెర్రీలను తినాల్సి ఉంటుంది.

3 /5

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చియా సీడ్స్‌, ఫ్లాక్స్ సీడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా ఈ వ్యాధి నుంచి సులభంగా బయటపడొచ్చు.

4 /5

అరటిపండును ప్రతి రోజూ తినడం వల్ల కూడా థైరాయిడ్‌ను అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ బితో సహా అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా థైరాయిడ్‌ను అదుపులో ఉంటుంది.

5 /5

ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు థైరాయిడ్‌ని నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాండా నెరసిపోయిన జుట్టును కూడా తిరిగి రంగులోకి తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో ఉసిరి తీసుకోవాల్సి ఉంటుంది.