Titanic 2 Ship: టైటానిక్ 2 నిర్మాణం ఎప్పుడు, ఎవరీ క్లైవ్ పామర్

టైటానిక్..ఇప్పటి తరాలు చూడకపోయినా అందరికీ తెలిసిన పదం. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్‌లో రిట్జ్ హోటల్‌లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది. 

Titanic 2 Ship: టైటానిక్..ఇప్పటి తరాలు చూడకపోయినా అందరికీ తెలిసిన పదం. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్‌లో రిట్జ్ హోటల్‌లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది. 

1 /6

క్లైవ్ పామర్ స్వతహాగా ఓ వ్యాపారవేత్త. ఓడలు తయారు చేసే బ్లూ స్టార్ లైన్ కంపెనీ యజమాని. 70 ఏళ్ల క్లైవ్ పామర్ ఆస్ట్రేలియా నుంచి ఎంపీగా ఉన్నారు. ఇటీవలే యునైటెడ్ ఆస్ట్రేలియా పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు.

2 /6

డెల్టామెరీన్ వంటి కంపెనీలు చేసిన రీసెర్చ్ ప్రకారం 56 వేల టన్నుల టైటానిక్ 2 ఓట ఖర్చు దాదాపుగా 500 మిలియన్ యూఎస్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు ఉండవచ్చు. 

3 /6

టైటానిక్ 2 ప్రాజెక్టు ప్రారంభంలో పేమెంట్ కారణంగా 2015లో నిలిచిపోయింది. 2022 వరకూ అంతా సెట్ అవుతుందని 2018లో పామర్ చెప్పినా కార్యరూపం దాల్చలేదు.  2020 నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించింది. 

4 /6

టైటానిక్ గత వైభవం మరోసారి చూసే అవకాశం ఎప్పుడు వస్తుందనే విషయంలో ఏ విధమైన క్లారిటీ లేదు. దశాబ్దం క్రితం టైటానిక్ 2 గురించి చెప్పిన క్లైవ్ పామర్ ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని రిపీట్ చేశాడు.

5 /6

6 /6

టైటానిక్ 2 సముద్రంలో తప్పకుండా తిరుగుతుందని అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ స్పష్టం చేశాడు. సిడ్నీలోని ఒపేరా హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో టైటానికి 2 గురించి ప్రస్తావించాడు. అంతేకాదు టైటానిక్ 2 డిజైన్ ఆవిష్కరించాడు.