Tollywood News: అప్పట్లో దర్శన్ ని ప్రేమించిన తెలుగు స్టార్ హీరోయిన్.. అందువల్లే కెరీర్ కి ఎండ్ కార్డ్..!

Darshan Past Lover: కన్నడ హీరో దర్శన్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమధ్య ఒక హత్య కేసులో.. ఇరుక్కున్న ఈయన.. అన్ని భాషల వారికి ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఒక తెలుగు హీరోయిన్ ఈ హీరోని ప్రేమించింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

1 /5

హాయ్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ నిఖితా. మొదటి సినిమా పరవాలేదు అనిపించుకున్న.. ఈ హీరోయిన్ కి అప్పట్లో వరసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత వెంటనే.. నితిన్ సంబరం సినిమాలో కనిపించింది. 

2 /5

అయితే సంబరం సినిమా కూడా పెద్దగా విజయం.. సాధించలేదు. అయినా ఆ తరువాత కల్యాణ రాముడు, డాన్ లాంటి చిత్రాలలో కనిపించింది. ఇక నాగార్జున హీరోగా వచ్చిన డాన్ చిత్రంలో అయితే ఏకంగా నెగటివ్ పాత్రలో కనిపించింది నిఖితా. 

3 /5

తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషలలో కూడా ఈ హీరోయిన్ ఎన్నో సినిమాలలో నటించింది. ఫ్లాపులు ఎదుర్కొన్న ఈ హీరోయిన్ కి సినిమా అవకాశాలు మాత్రం వచ్చాయి. అయితే ఈ హీరోయిన్ చేసిన చిన్న తప్పు వల్ల అవకాశాలు కాస్తా పోయాయి. 

4 /5

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఈ హీరోయిన్.. ఆల్రెడీ పెళ్లైన స్టార్ దర్శన్ తో ప్రేమాయణం నడిపింది. ఇంకా ఈ విషయం కాస్త బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ కూడా నిఖితా తీరుపై మండిపడ్డారు. ముఖ్యంగా అప్పట్లో దర్శన్ భార్య నిఖితాకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.. 

5 /5

తన భర్తకు దూరంగా ఉండాలని అతని భార్య అప్పట్లో సీరియస్ అయ్యింది. దీంతో నిఖితా తన ప్రేమను వదిలేసింది. కానీ అదే సమయంలో ఈ హీరోయిన్  వరుస వివాదాలు చుట్టుముట్టాయి. అప్పట్లో దర్శన్ భార్య.. అతడి పై గృహహింస కేసు కూడా పెట్టడం గమనర్హం. ఈ కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు.  ఇక ఆ విషయం జరిగాక.. కన్నడ సినీ పరిశ్రమలో నిఖిత, దర్శన్ వ్యవహరం పెద్ద దుమారం రేపటమే కాకుండా..  నిఖితపై కన్నడ సినీ నిర్మాతల సంఘం మూడు సంవత్సరాల పాటు నిషేదం విధించింది. దీంతో ఇతర భాషల్లో కూడా ఈ హీరోయిన్ కి అవకాశాలు రాక ఆమె కెరియర్ కి ఎండ్ కార్డ్.. పడింది.