World Biggest Airport: దుబాయ్‌లో నిర్మితమౌతున్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం

అత్యంత ధనికదేశంగా, కలల నగరంగా పేరుగాంచిన దుబాయ్ అంటేనే ఆకాశాన్నంటే భవనాలు, లగ్జరీ వాహనాలు, ప్రపంచంలోనే ఖరీదైన వస్తువులు, ఒకటేంటి సమస్తం లభిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు సమకూర్చుకోవచ్చు. ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే ప్రపంచంలోనే అతి పెద్దదైన విమానాశ్రయ నిర్మాణం. 

World Biggest Airport: అత్యంత ధనికదేశంగా, కలల నగరంగా పేరుగాంచిన దుబాయ్ అంటేనే ఆకాశాన్నంటే భవనాలు, లగ్జరీ వాహనాలు, ప్రపంచంలోనే ఖరీదైన వస్తువులు, ఒకటేంటి సమస్తం లభిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు సమకూర్చుకోవచ్చు. ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే ప్రపంచంలోనే అతి పెద్దదైన విమానాశ్రయ నిర్మాణం. 
 

1 /5

2023లో ప్రయాణీకుల అంచనా 86.8 మిలియన్లు. 2024-2025లో 88.2 మిలియన్ల నుంచి 93.8 మిలియన్ల వరకూ ఉంటుంది. 

2 /5

ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కోసం ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం తూర్పు యూరప్, రష్యా, మధ్య ఆసియాకు సేవలు అందిస్తోంది. 

3 /5

ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. కరోనా మహమ్మారి తరువాత ఎయిర్‌పోర్ట్ పనుల్లో వేగం కన్పిస్తోంది.

4 /5

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అధారిటీనే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ పనులు పూర్తి కాగానే ఏడాదికి  16 కోట్ల కంటే అధికంగా ప్రయాణీకుల్ని తట్టుకునే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక గూడ్స్ పరంగా ఏడాదికి 12 కోట్ల టన్నులు రవాణా అవుతుంది.

5 /5

2013లో దుబాయ్‌లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. దుబాయ్ నగరం నుంచి 20 మైళ్ల దూరంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం పనులు కొనసాగుతున్నాయి.