ibomma income: ఎవరు ఐబొమ్మలో కొత్త మూవీస్ పెడతారు?..ఈ సైట్ సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ibomma income: మిడిల్ క్లాస్ వాళ్ల ఓటీటీ ప్లాట్‌పామ్ ఐ బొమ్మ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ వెబ్ సైట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో సినిమాలు చూసినా అనుభవం ఉంది. థియేటర్లలో టికెట్ల ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఓటీటీ వెబ్ సైట్‌లలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఓటిటి ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ధరలు కూడా పెరగడంతో చాలామంది ఐబొమ్మలో సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

1 /8

అంతేకాకుండా ఓటీపీ వెబ్ సైట్‌లలో వచ్చే ప్రతి కొత్త సిరీస్, సినిమాలు ఐ బొమ్మలో స్ట్రీమింగ్ అవడంతో మరింత ప్రజాదరణ సంపాదించుకుంది. అయితే చాలామందికి ఈ ఐ బొమ్మ గురించి సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది అయితే ఈ ఐబొమ్మాలో సినిమాలు ఎవరు పెడతారని గూగుల్లో సెర్చ్ కూడా చేస్తున్నారు.  

2 /8

మరికొంతమంది అయితే ఈ ఐ బొమ్మ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు.. ఈ ఐ బొమ్మ వాడడం వల్ల వైరస్ వస్తుందా..లేదా?. అసలు ఐ బొమ్మలో సినిమాలు ఎక్కడి నుండి అప్లోడ్ చేస్తారు?. అనే ప్రశ్నలను గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు.   

3 /8

ఇప్పటికీ చాలామందికి ఐ బొమ్మ సైట్‌లో కొత్త సినిమాలు ఎవరు పెడుతున్నారన్న ప్రశ్నకి సమాధానమే దొరకలేదు. దీనిని ఎవరు నడుపుతారు? అనేది కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు.

4 /8

ఇటీవల కొంతమంది టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐ బొమ్మ వెబ్ సైట్‌ని విదేశాల నుంచే నడుపుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సైట్ డొమైన్ బ్లాక్ చేసినప్పటికీ మరో డొమైన్ బుక్ చేసుకుని అందులో సినిమాలు పెడుతున్నట్లు సమాచారం.  

5 /8

అయితే ఇప్పటికే ఐబొమ్మను బ్యాన్ చేయాలని పెద్ద పెద్ద నిర్మాతలు పలుసార్లు పోలీసులకు కంప్లైంట్ చేయగా.. చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.

6 /8

ఐబొమ్మలో పదేపదే సినిమాలు చూడడం వల్ల మొబైల్ లేదా కంప్యూటర్లో వైరస్ డౌన్‌లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా అనేక సమస్యలు వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

7 /8

నిత్యం ఈ ఐ బొమ్మ వెబ్ సైట్‌లలో లక్షలాదిమంది సినిమాలు చూస్తున్నారు. దీని కారణంగా సైట్‌కి గూగుల్ పదేపదే అడ్వర్టైజ్మెంట్లను కూడా అందిస్తోంది. దీంతో లక్షలకు లక్షలుగా ఆదాయం జనరేట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

8 /8

ఐ బొమ్మలో పదేపదే సినిమాలు చూడడం చట్టరీత్య నేరమే..సినిమాలు చూడడం క్రైమ్ కిందికి వస్తుంది. అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ఐ బొమ్మ వెబ్సైట్లో సినిమాలు చూస్తున్నారు.